Last Updated:
Officer Misconduct: భూ సంబంధిత సమస్య పరిష్కారం కోసం కార్యాలయానికి వెళ్లిన తన భార్యతో, సోమందేపల్లి తహసీల్దార్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తూ ఒక వ్యక్తి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.
Officer Misconduct: ఉరుకుల పరుగుల జీవితంలో మనుషుల మధ్య ఉండాల్సిన ఆత్మీయత, అనుబంధం తగ్గిపోతున్నాయి. టెక్నాలజీ వల్ల లాభాలు ఉన్నప్పటికీ, దానిని తప్పుడు మార్గాల్లో ఉపయోగించి ఇతరులను ఇబ్బంది పెట్టడం పెరిగింది. పిల్లల రక్షణ, మహిళల భద్రత విషయంలో ప్రతిరోజూ వింటున్న వార్తలు దారుణంగా ఉంటున్నాయి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు నైతిక విలువలు తగ్గడం, పెరుగుతున్న నేరాలు, మనుషుల మధ్య నమ్మకం సన్నగిల్లడం వంటివి చూస్తుంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లిలో జరిగిన సంఘటన షాక్ గురించేస్తోంది.
భూ సంబంధిత సమస్య పరిష్కారం కోసం కార్యాలయానికి వెళ్లిన తన భార్యతో, సోమందేపల్లి తహసీల్దార్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తూ ఒక వ్యక్తి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన భార్యను, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ పదేపదే తిరిగేలా చేసి, చివరకు మోసపూరిత మాటలతో ఆమెను వలలో వేసుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక కుమార్తె తనకు ఉందని ప్రస్తావిస్తూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.అయితే ఈ ఘటనపై కలెక్టర్ తక్షణమే స్పందించి, ఈ విషయంపై విచారణ జరపాలని ఆదేశించారు.
తహసీల్దార్ కార్యాలయాల్లోలోనే కాదు ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం లేదా అధికార దుర్వినియోగానికి పాల్పడటం చాలా తీవ్రమైన నేరం. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ Spandana కార్యక్రమంలో జిల్లా కలెక్టరుకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు వేధింపులు లేదా అక్రమ ప్రవర్తనపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేయాలి. మహిళా కమిషన్ రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించి రక్షణ న్యాయం కోరవచ్చు.
ఏసీబీ (ACB) ఒకవేళ ఆ అధికారి పనుల కోసం లంచం ఆశించినా లేదా అధికారంతో వేధించినా అవినీతి నిరోధక శాఖకు 1064 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.భూ సమస్య పరిష్కారం కోసం ఉన్నతాధికారుల (RDO లేదా జాయింట్ కలెక్టర్) పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరే హక్కు మీకు ఉంది అని మేధావులు విశ్లేషకులు చెబుతున్నారు .
Anantapur,Anantapur,Andhra Pradesh



