Nara Lokesh: ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రులు గెలిచిన రోజు.. ఎమోషన్ డే: నారా లోకేశ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Nara Lokesh: ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైన రోజు.. ఐదు కోట్ల మంది ఆంధ్రులు గెలిచిన రోజు అని మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ దేశంలోని అన్ని పార్టీలు ఏపీకి రాజధాని విషయంలో మద్దతు తెలిపాయని ఆనందించారు. ఇప్పుడే కాదు ఆనాడు కూడా అన్ని పార్టీలు అమరావతికి మద్దతును ఇచ్చాయని తెలిపారు.

nara lokesh
nara lokesh

Nara Lokesh: ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైన రోజు.. ఐదు కోట్ల మంది ఆంధ్రులు గెలిచిన రోజు అని మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ దేశంలోని అన్ని పార్టీలు ఏపీకి రాజధాని విషయంలో మద్దతు తెలిపాయని ఆనందించారు. ఇప్పుడే కాదు ఆనాడు కూడా అన్ని పార్టీలు అమరావతికి మద్దతును ఇచ్చాయని తెలిపారు. నాడు రాజధాని కోసం మహిళలు, రైతులు దీక్షలు చేశారని తెలిపారు. ఇలా దీక్షలు చేసిన మహిళలు, రైతులపై ఆనాడు దాడులు చేశారని మంత్రి లోకేశ్ గుర్తు చేశారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడారు.

వైసీపీ అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 వరకు మూడు ముక్కలాట ఆడారని మంత్రి లోకేశ్ దుయ్యబట్టారు. ఇప్పటికీ రాజధాని విషయంలో జగన్ మోసం చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికీ మూడు రాజధానులు అంటూ జగన్ ప్రకటనలు చేస్తున్నారని విమర్శలు చేశారు. ఆనాడు జగన్ కూడా అమరావతికి మద్దతు తెలిపారన్నారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి మూడు రాజధానులు అంటూ మాట మార్చారని అన్నారు. అందుకే ప్రజలు మూడు రాజధానులను తిప్పి కొట్టారు.

అందుకే మళ్లీ 2024 ఎన్నికల్లో ప్రజా రాజధాని అమరావతే అని తీర్పు ఇచ్చారని అన్నారు. అలాగే విభజన చాలా దారుణంగా జరిగిందని, ఇప్పటికీ ఆ విభజన సమస్యలను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇలాంటి సమస్యలు వస్తాయనే ఆనాడు రెండు రాష్ట్రాలకు న్యాయం చేసిన తర్వాతనే విభజన చేయాలని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు.

రాజధానికి పట్టిన గ్రహణం వీడింది:

రాజధాని అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆనందించారు. ఈ బిల్లుల ఆమోదంతో రాజధానికి పట్టిన గ్రహణం వీడిందని అన్నారు. దీంతో అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అన్నారు. ఈ క్రమంలో న్యూదిల్లీలో విలేకర్లతో మాట్లాడారు. ఈ సమయంలో అమరావతికి దీప హారతులు ఇద్దామని రాష్ట్ర ప్రజలకు పిలుపు నిచ్చారు.

#APThanksIndia హ్యాష్‌ట్యాగ్‌తో ఫొటోలు షేర్ చేయండి: ఇవాళ(గురువారం) రాత్రి 7 గంటలకు అంతా ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ఈ దీపాలతో సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ పిలుపునిచ్చారు. #APThanksIndia హ్యాష్ ట్యాగ్‌తో అందరూ ఫొటోలు షేర్ చేయాలని ప్రజలకు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ సందర్భంగా అమరావతికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. అమరావతి అంటే ఐదు కోట్ల మంది ఆంధ్రుల గుండె చప్పుడు. కేవలం సీఎం చంద్రబాబు పిలుపుతో రైతులు 33 వేల ఎకరాల భూములు ఇచ్చారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *