Digambara Swamis: విశాఖ వీధుల్లో తిరుగుతున్న దిగంబర స్వాములు.. ఏంది సామి ఇది మేం ఎప్పుడూ చూడలా | ట్రెండింగ్


Last Updated:

Digambara Swamis: దిగంబరులు మన తెలుగు రాష్ట్రానికి విచ్చేశారు. ఒంటిపై నూలు పోగు లేకుండా పూర్తిగా నగ్నంగా నగర వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న వారిని చూసి జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు.

Digambara Swamis
Digambara Swamis

Digambara Swamis: దిగంబరులు మన తెలుగు రాష్ట్రానికి విచ్చేశారు. ఒంటిపై నూలు పోగు లేకుండా పూర్తిగా నగ్నంగా నగర వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న వారిని చూసి జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంలో దేశ సంచారంలో భాగంగా దిగంబర స్వాములు తిరుగుతున్నారు.గురువారం నగరానికి వచ్చిన దిగంబరస్వాములకు పోలీస్ ఎస్కార్ట్ భద్రత కల్పిస్తున్నారు. వారి వెంటే నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం విశాఖనగరంలో తిరుగుతున్న దిగంబర స్వాములు హిమాలయాలు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఒంటిపై దుస్తులు లేకుండా..

భారతదేశంలో జరిగే కుంభమేళ, పుష్కరాలు, ఉత్సవాల్లో అఘోరాలు, నాగసాధువులతో పాటు దిగంబర స్వాములు కూడా ప్రత్యక్షమవుతూ ఉంటారు. అయితే వీళ్లలో అఘోరాలు, నాగసాధువులు సాధారణ మనుషుల్లా కాకుండా వేషం, భాషా, కట్టుబొట్టు కాస్త భిన్నంగా ఉంటాయి. సామాన్య జీవితానికి స్వస్తి పలికి దైవాంసమార్గంలో జీవిస్తుంటారు. దేశం అంతటా తిరుగుతూ పరిత్యాగం చేస్తుంటారు. వీళ్లలో ముఖ్యులు దిగంబర స్వాములు. అంటే వీళ్లు అఘోరాలు, నాగసాధువుల్లా కాకుండా ఒంటిపై దుస్తులు లేకుండా సంచరిస్తుంటారు. ఒకచోట మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా అన్నీ శైవక్షేత్రాలను సందర్శిస్తారు. అయితే తాజాగా దిగంబర స్వాములు విశాఖపట్నంలోని అల్లిపురం, పూర్ణ మార్కెట్, శంకరమఠం, ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో దిగిపోయారు.

5ప్రాంతాల్లో పర్యటన..

నగరంలోని ఇలా దాదాపు 5 ప్రాంతాల్లో దిగంబర స్వాములు నగరంలో తిరుగుతున్నారు. వీరికి ప్రత్యేక భద్రత ఏర్పాట్లను చేశారు విశాఖపట్నం నగర పోలీసులు. వీరంతా హిమాలయాల, ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి వస్తుంటారని వీరు దేశ సంచారం చేస్తూ.. ఆ తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారని అంటున్నారు. ఈ క్రమంలో సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రత్యేకించి వీరికి భద్రతను ఇస్తున్నారు. ప్రత్యేకించి ఈ దిగంపర స్వాములకు ఇలాంటి భద్రతను ఇవ్వాలన్నది రూల్ గా ఉందని సిటీ పోలీస్ అధికారులు చెప్తున్నారు.

ఇదో ప్రత్యేకమైన సన్యాస సంప్రదాయం..

దిగంబర స్వాములు అనేది భారతదేశంలో ప్రత్యేకమైన సన్యాస సంప్రదాయం. దిగంబర అనే పదం రెండు సంస్కృత పదాల నుంచి వచ్చింది. దిశలనే వస్త్రంగా ధరించినవారనే అర్ధం వస్తుంది. దిగంబర స్వాముల లక్షణాలు చూసుకుంటే సాధారణంగా వస్త్రాలు ధరించరు (పూర్తిగా లేదా చాలా తక్కువగా)వేసుకుంటారు. లోకాసక్తులను పూర్తిగా త్యజించినవారు. సంపూర్ణ వైరాగ్యం , ఆత్మజ్ఞానం కోసం జీవిస్తారు. చాలా కఠినమైన తపస్సు , యోగ సాధనలు చేస్తారు. ఈ విధానం ప్రధానంగా జైనమతం దిగంబర పంథాలో కనిపిస్తుంది.అలాగే కొంతమంది హిందూ సన్యాసులు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *