Corruption: ఆ జిల్లాల్లో ప్రభుత్వశాఖలో 25మందికి షోకాజ్ నోటీసులు.. సస్పెండ్ వేటు ఎందుకో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

APSPDCL Corruption: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 25 మంది అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఆ జిల్లాల్లోని విద్యుత్ శాఖలో షోకాజ్ నోటీసులు కలకలం, సస్పెండ్ వేటు ఎందుకో తెలుసా
ఆ జిల్లాల్లోని విద్యుత్ శాఖలో షోకాజ్ నోటీసులు కలకలం, సస్పెండ్ వేటు ఎందుకో తెలుసా

APSPDCL Corruption: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 25 మంది అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సంస్థ పరిధిలోని వివిధ సర్కిళ్ళలో విధులు నిర్వహిస్తూ అవినీతి ఆరోపణలు, హెచ్ టి సర్వీసుల రీడింగ్ నమోదులో అవకతవకలు, అనధికారికంగా పనులను చేపట్టడం తదితర అంశాలపై ఒకరిద్దరు కాదు పాతిక మంది అందులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి నుండి అసిస్టెంట్ లైన్ మెన్ వరకు అందరిపై వేటు వేశారు.

విమర్శలపై షోకాజ్ నోటీసులు జారీ..

ప్రభుత్వ ఉద్యోగుల్లో అనేక శాఖల్లో అవినీతిపరులు ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు. వాళ్ల కాసుల కక్కూర్తి పరాకాష్టకు చేరినప్పుడు పట్టుబడి సస్పెండ్ అవుతారు. అయితే రాష్ట్రంలోనే అనేక జిల్లాలో ఇప్పుడు ఒకే ప్రభుత్వ రంగశాఖలో పని చేస్తున్న 25 మందికి షోకాజ్ నోటీ జారీ చేయడం కలకలం రేపుతోంది.

అవకతవకలు..

సంస్థ పరిధిలోని వివిధ సర్కిళ్ళలో డ్యూటీ నిర్వహిస్తూ అవినీతి ఆరోపణలు, హెచ్ టి సర్వీసుల రీడింగ్ నమోదులో అవకతవకలు, అనధికారికంగా పనులను చేపట్టినట్లుగా సుమారు 25మందిపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఏపీఎస్పీడీసీఎల్ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-1, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు-7, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్/అసిస్టెంట్ ఇంజనీర్-6, జూనియర్ ఇంజనీర్-1, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్-1, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్-1, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 1, లైన్ ఇన్స్పెక్టర్ 2, లైన్ మ్యాన్ 3, అసిస్టెంట్ లైన్ మ్యాన్ 1, ఎనర్జీ అసిస్టెంట్ 1పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.

అవినీతి ఆరోపణలు..

తిరుపతి సర్కిల్ లో అనధికారికంగా పనుల నిర్వహణ అంశానికి సంబంధించి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి. సాయిశంకర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి. విశ్వనాధంలకు 2 ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా తిరుపతి సర్కిల్లోనే విధులు నిర్వహిస్తూ అనధికారికంగా విద్యుత్ లైన్ల మార్పు అంశంపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. శ్రీనివాసమూర్తి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి. చిన్నప్ప, అసిస్టెంట్ ఇంజనీర్ ఎస్. హేమచంద్రుడు, లైన్ ఇన్స్పెక్టర్ ఎం. శరత్ బాబు, లైన్ మ్యాన్ ఎస్ఆర్ గోపాల్ ను, అలాగే తిరుపతి సర్కిల్లో విధులు నిర్వహిస్తూ అవినీతి ఆరోపణలపై డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి. విజయ వెంకటేష్, లైన్ మ్యాన్ బి. శేఖర్, అసిస్టెంట్ లైన్ మ్యాన్ కె. సురేష్, జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్- 2 టీ. భాగ్యరాజ్ లను వివరణ కోరుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

అక్కడ ఇక్కడ కాదు..

కర్నూలు సర్కిల్ లో హెచ్ టి సర్వీసుకు సంబంధించి రీడింగును నమోదు చేయడంలో అవకతవకలకు పాల్పడిన అంశంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జె. చిన్నరాఘవులుకు 6 నెలలపాటు పదోన్నతి నిలుపుదల, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.వి. మోహన్ కుమార్ కు ఒక ఇంక్రిమెంటును నిలుపుదల, మరో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ. రాజమోహన రెడ్డికి 2 ఇంక్రిమెంట్లు నిలుపుదల, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కె. సుబ్రమణ్యం శెట్టికి 2 ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వినియోగదారుని సర్వీసు పేరు మార్పు అంశంలో నిర్లక్ష్యం వహించినందుకు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ జి. బాలచౌడయ్యను వివరణ కోరుతూ ఆదేశాలు జారీ చేశారు.

సీమలో అవినీతిపరులు..

అదే విధంగా కడప సర్కిల్లో విధులు నిర్వహిస్తూ అనధికారికంగా విద్యుత్ లైన్ల మార్పు అంశంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యం. కుళ్ళాయప్ప, అసిస్టెంట్ ఇంజనీర్ టి. శివకుమార్, లైన్ ఇన్స్పెక్టర్ అయ్యవారయ్య, లైన్ మ్యాన్ నాగసుబ్బారెడ్డిలను వివరణ కోరుతూ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీసత్యసాయి సర్కిల్లో విధులు నిర్వహిస్తూ అనధికారికంగా విద్యుత్ లైన్ల మార్పు అంశంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి. విశ్వనాధంకు ఒక ఇంక్రిమెంటును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ఘంజూరులో నిబంధనలను పాటించనందుకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్. విశ్వనాధంను వివరణ కోరుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

జెఇ, ఎఎల్ఎమ్ సస్సెన్షన్..

అనంతపురం సర్కిల్లో వ్యవసాయ విద్యుత్ సర్వీసును మంజూరు చేయడంలో అవకతవకలకు పాల్పడిన అంశంపై ఇన్చార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న జూనియర్ ఇంజనీరు బి. బాల చంద్రను విధుల నుంచి సస్పెండ్ చేశారు. అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. శ్రీనివాసులు నాయుడుకు షోకాజ్ నోటీసును జారీ చేశారు. ఇక చిత్తూరు సర్కిల్లో అనధికారికంగా లైన్ల మార్పు, ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు అంశంలో అసిస్టెంట్ లైన్ మ్యాన్ ఎస్. రమేష్ బాబును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *