Last Updated:
రాజ్యసభ సీటుపై యనమల రామకృష్ణుడు ఆశలు, తుని పరిధికే పరిమితమైన ఆయన, చిన్నల్లుడు పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసు ఆరోపణలతో అనిశ్చితి పెరిగింది
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో యనమల రామకృష్ణుడు అంటే తెలియని వారు ఎవరు ఉండరు, ఉమ్మడి రాష్ట్రాలు కలిసి ఉన్నప్పటి నుంచి, నేటి వరకు ఎన్నో పదవులు అనుభవించినా యనమల, ప్రస్తుతం ఆయన సొంత నియోజకవర్గానికి పరిమితమయ్యాయు, ఎలక్షన్‌లో ప్రత్యక్షంగా యనమల పెద్దకుమార్తెను ఒకచోట, చిన్నల్లుడును మరోకచోట రంగంలోకి దింపి విజయకేతనం ఎగర వేయించారు. అయితే ఆయన మాత్రం ఎక్కడా పోటీ చేయకుండా ఈ ఎలక్షన్లలో దూరంగా ఉన్నారు.
కానీ ఆయన మనసులో మాత్రం పెద్దల సభకు వెళ్లాలని కోరిక బలంగా ఉన్నట్లు పార్టీ క్యాడర్ వినిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఆయనకు ఒక సమస్య సైతం ఎదురైంది. యనమల చిన్నల్లుడు అయినా పుట్టామహేష్ యాదవ్ ఒక డ్రగ్స్ కేసు సంబంధించిన ఆరోపణలు ఆయనపై బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ సమస్య యనమలకు చుట్టుముట్టి ఆయన పదవి దూరమవుతుందా లేక ఆయనకు ఎంతో ఆప్తులు అయిన ముఖ్యమంత్రి రాజ్యసభ పదవి యనమలకు అందిస్తారా అన్నది వేచి చూడాల్సిందే..
యనమల రామకృష్ణుడు మనసులో ఉన్న మాట ఎన్నో సార్లు బహిరంగం చేశారని చెప్పుకోవచ్చు. ఎన్నో మంత్రి పదవులు చేసాను, చైర్మన్లు చేశాను, నేను చూడని పదవిలేదు, నేను ఏరోజు పదవి కోరుకోలేదు? కానీ ప్రతి పదవి నన్ను వరించింది, అయితే తాజాగా అంతా దైవాజ్ఞ దేవుడు ఎలా సంకల్పిస్తే అలా అంటూ ఆయన తెలుగుదేశం పార్టీ సమావేశంలో పేర్కొన్నారు.1982 నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీలో ఉన్న యనమల రామకృష్ణుడు మొట్ట మొదటిసారిగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తొలిసారి మంత్రి గా సేవలందించారు. నాటి నుంచి నేటి వరకు అనేక పదవులు చేసిన రామకృష్ణుడు ఇటీవలే ఎమ్మెల్సీ గడువు ముగిసిన నేపథ్యంలో ఆయన తుని నియోజకవర్గానికి పరిమితమయ్యాయు. ఆయన కుమార్తె యనమల దివ్య వెనుక ఉంటూ రాజకీయ భవిష్యత్తుపై ఆయన కుమార్తెను ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో రెండు రాజ్యసభ సీట్లు కూటమికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక సీటు ఎలా అయినా యనమలకు వస్తుంది అన్న ఆశాభావం యనమల వర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది.
అయితే బహిర్గతంగా యనమల బయట పెట్టకపోయినా ఆయన మనసు నిండా అదే కోరిక ఉందని పలువురు గుసగుసలాడుతున్నారు. కానీ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈసారి యువతకు అవకాశం కల్పిస్తున్నామని యనమలే స్వయంగా చెబుతున్నారు, సరే ఇక రాజ్యసభ విషయానికొస్తే ఇటీవలే జరిగిన షాఖ్ చూపించి ఈసారి యనమలకు షాక్ ఇస్తారా, లేక యనమలకు ఈ పదవి ఇస్తారా అన్నది వేచి చూడాల్సిందే..
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


