Live News Today: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్.. రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టిన ప్రభుత్వం | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Live News Today: నేటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఆరోగ్యశ్రీ నిలిపివేస్తున్న ఆషా ప్రకటించింది. బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. రూ.3 వేల కోట్ల ఆరోగ్య శ్రీ బిల్లులు బకాయి పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాకు రెండోసారి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ అయ్యాయి. గతంలో సమ్మె చేసినప్పుడు బకాయిలు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత డిసెంబర్ నెలాఖరుకు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మార్చి 31 వచ్చినా బకాయిలను ఇంకా చెల్లించకపోవడంతో బంద్‌కు పిలుపునిచ్చారు.

యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన విమాన ఇంధన ధరలు: 

యుద్ధ ప్రభావంతో భారీగా పెరిగిన విమాన ఇంధన ధరలు. భారత్‌లో 115 శాతం పెరిగిన ఏవియేషన్ టర్బైన్ ఇంధనం ధరలు. దీంతో విమాన ప్రయాణాలు మరింత ప్రియం అయ్యాయి. రెండింతలు పెరిగిన జెట్ ఫ్యూయల్ ధరలు. కిలో లీటరుకు రికార్డు స్థాయిలో పెరిగింది. దిల్లీలో గతంలో కిలో లీటరు జెట్ ఫ్యూయల్ రూ.96 వేలుగా ఉండేది. అది ఇప్పుడు కిలో లీటరు విమాన ఇంధరన ధర రూ.2.07 లక్షలకు చేరింది.

ఇవాళ సీఎం చంద్రబాబు నెల్లూరు, కడప పర్యటన.. ఒకవైపు పింఛన్లు, మరోవైపు సీతారాముల కల్యాణం: 

నెల్లూరు, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పర్యటించనున్నారు. ఓవైపు పేదల సేవలో, మరోవైపు భగవంతుని సేవలో అన్నట్లుగా ఒకే రోజు రెండు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ముందుగా నెల్లూరు జిల్లా వింజమూరులో పేదల సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా కడప జిల్లా ఒంటిమిట్టకు వెళ్లి సీతారాముల వారి కల్యాణ మహోత్సవం సందర్భంగా సీతారాముల వారికి సతీమతేంగా వెళ్లి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అనేవి సమర్పిస్తారు.

ఏప్రిల్ నెల కొత్త నిబంధనలు ఇవే: 

భారతదేశ ప్రజలకు ముఖ్యమైన అప్డేట్. ఏప్రిల్ 1వ తేదీ(ఈరోజు) నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. సాధారణంగా ప్రతి నెల మొదటి తేదీన ధరల్లో మార్పులు లేదా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అప్డేట్లు వస్తుంటాయి. ఈసారి కూడా కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

ప్రధానంగా డిజిటల్ చెల్లింపుల విషయంలో మార్పులు ఉండనున్నాయి. ఇప్పటివరకు కేవలం ఓటీపీతో ట్రాన్సాక్షన్లు చేసేవాళ్లం. కానీ ఇకపై ప్రతి లావాదేవీకి కనీసం రెండు భద్రతా విధానాలు అవసరం అవుతాయి — పిన్/పాస్‌వర్డ్, రిజిస్టర్డ్ డివైస్, ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడీ వంటి వాటిలో ఏవైనా రెండు తప్పనిసరి. సైబర్ మోసాలను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు.

అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంక్‌లలో E-20 పెట్రోల్ వినియోగం తప్పనిసరి చేయబడింది. కేవైసీ పూర్తి చేయని ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలు బ్లాక్ చేయబడతాయి. కొన్ని బ్యాంకులు డెబిట్ కార్డుల నిర్వహణ ఛార్జీలను పెంచాయి. ఇకపై కొత్త బీమా పాలసీలు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ రూపంలోనే జారీ చేయాల్సి ఉంటుంది. అలాగే గోల్డ్ లోన్ తిరిగి చెల్లింపు గడువు 180 రోజుల నుంచి 270 రోజులకు పెరిగినట్లు సమాచారం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *