Success Story: తక్కువ పెట్టుబడి – ఎక్కువ ఆదాయం.. రెసిన్ ఆర్ట్ వ్యాపారంలో విజయనగరం యువతి మౌనిక సరికొత్త దారి.. |


Last Updated:

విజయనగరం తోటపాలెం మౌనిక రెసిన్ ఆర్ట్ తో కస్టమైజ్డ్ డిజైనింగ్ ప్రోడక్ట్స్ తయారు చేసి Instagram ద్వారా దేశవ్యాప్తంగా విక్రయిస్తూ మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

+

తక్కువ

తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే స్వయం ఉపాధి

విజయనగరం పట్టణంలోని తోటపాలెం చెందిన మౌనిక స్వయం ఉపాధిలో కొత్త దారిని చూపిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తోంది. ఇంటి వద్దే ఉంటూ రెసిన్ ఆర్ట్‌తో విభిన్నమైన డిజైనింగ్ ప్రోడక్ట్స్ తయారు చేసి ఆన్‌లైన్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.

మౌనిక తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో మొబైల్ పౌచ్‌లుపై డిజైనింగ్కీ,చైన్‌లు డిజైనింగ్, నేమ్ బోర్డులు డిజైనింగ్, ఇయర్ రింగ్స్, వెడ్డింగ్ కార్డ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ పైన డిజైన్స్ వంటి అనేక రకాల వస్తువులు ఉన్నాయి. వీటిని పూర్తిగా కస్టమర్ అభిరుచికి అనుగుణంగా కస్టమైజ్ చేసి అందించడం ఈమె ప్రత్యేకత. వినియోగదారులు కోరిన విధంగా పేర్లు, డిజైన్లు, రంగులు జోడించి అందంగా తయారు చేస్తోంది.

ఈ వ్యాపారం కోసం అవసరమైన రా మెటీరియల్‌ను హోల్సేల్‌గా ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసుకుంటున్నట్లు మౌనిక తెలిపింది. రెసిన్ అనే లిక్విడ్ కెమికల్‌తో తయారు చేసే ఈ ఉత్పత్తులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉండటంతో, ఒక్కో ప్రోడక్ట్ పూర్తవ్వడానికి సుమారు 10 నుండి 15 రోజుల వరకు సమయం పడుతుందని ఆమె తెలిపారు . అయితే బల్క్ ఆర్డర్లను సమర్థంగా నిర్వహిస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం మౌనిక తన వ్యాపారాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విస్తరించింది. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆర్డర్లను స్వీకరించి దేశవ్యాప్తంగా ఎక్కడికైనా డెలివరీ చేస్తోంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించిన ఈ వ్యాపారం, క్రమంగా మంచి ఆదాయ వనరుగా మారిందని ఆమె పేర్కొంది.

ఇంటి పనులతో పాటు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న మౌనిక, స్వయం ఉపాధి కోరుకునే యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ముఖ్యంగా మహిళలు ఇంటి వద్ద నుంచే ఇలాంటి సృజనాత్మక పనులు చేయడం ద్వారా ఆర్థికంగా స్వతంత్రత సాధించవచ్చని ఆమె సూచిస్తోంది. స్థానికంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా వినియోగదారులను సంపాదిస్తూ తన ప్రతిభను చాటుతున్న మౌనిక, భవిష్యత్తులో మరింత విస్తరణపై దృష్టి సారించినట్లు తెలిపింది. ఈ విధంగా ఇంటి వద్దే ప్రారంభించిన చిన్న వ్యాపారం, నేడు పెద్ద అవకాశాల దిశగా పయనించడం విశేషం.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *