Vadapalli Temple: కోనసీమ తిరుపతిలో కోలాహలం.. అంగరంగ వైభవంగా వాడపల్లి వేంకటేశ్వరుని రథోత్సవం! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

వాడపల్లి వెంకటేశ్వర స్వామి రథోత్సవం, కళ్యాణ మహోత్సవం పూరీ మహాక్షేత్రాన్ని తలపిస్తూ లక్షలాది భక్తులతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

+

వాడపల్లి

వాడపల్లి రథోత్సవం ఘనంగా కళ్యాణం

ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి రథోత్సవం కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పూరీ మహాక్షేత్రాన్ని తలపించే విధంగా ఈ ఏడాది వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం విశేష భరితంగా జరిగిందని చెప్పుకోవచ్చు.

అనంతరం జరిగిన కళ్యాణం కమనీయంగా లక్షలాది భక్తజనుల సమక్షంలో జరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు అసౌకర్యాలు తలెత్తకుండా వాడపల్లి దేవస్థానంతో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేసింది ఒకసారి వివరాలు చూద్దాం.

ఏడేడు జన్మల పుణ్యఫలం 7 వారాల వెంకటేశ్వర స్వామిని దర్శించడం అనేవిధంగా, ఏపీలో తిరుపతి తర్వాత మరో తిరుపతిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రం విరాజిల్లుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వామిని ఏడు వారాల వెంకటేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారు.

తిరుపతి తర్వాత మరల అంత పెద్ద మొత్తంలో ఆదాయం సైతం ఈ దివ్యక్షేత్రానికే వస్తుందని చెప్పుకోవచ్చు. అటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా జరిగిన రథోత్సవానికి ఇసుక వేస్తే రాలని విధంగా భక్తజనులు పాల్గొన్నారు. గోవింద నామాలు జపిస్తూ రథం ముందు రథం వెనక లక్షలాదిగా భక్తులు అడుగులో అడుగు వేస్తూ రథ సేవలో పాల్గొన్నారు.

మరోపక్క స్వామివారి కళ్యాణం సైతం కమనీయంగా జరిగింది. విద్యుత్ కాంతులు పరిమళిస్తున్న పుష్పాల నడుమ అందంగా అలంకరించిన చక్కని పందిరిలో కలియుగ ప్రత్యక్ష దైవమైన నారాయణుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేయించింపచేసి, శాస్త్ర పర్వంగా గణపతి పూజ, పుణ్యహవచనం, కంకణ ధారణ, మాంగల్య ధారణ, తలంబ్రాలు ఘట్టాలు నేత్రపర్వంగా నిర్వహించారు.

అశేష భక్తజనుల ఈ కళ్యాణాన్ని కనులారా తిలకించి ఆధ్యాత్మిక పారవశ్యం చెందారు. మరోపక్క దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి చక్రధర్ రావు నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు జిల్లా అధికార యంత్రాంగం ఈ కళ్యాణ, రథోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకుంది.

వాడపల్లి అంటేనే భక్తజన సందోహం, అలాంటిది స్వామివారి కల్యాణం అంటే ఆభక్త జనులు సంఖ్య రెండింతలు అయిందని చెప్పుకోవచ్చు, దీంతో గోదావరి జిల్లాలు గోవిందుని కళ్యాణంతో కలకలలాడుతూ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు .

మరొక మూడు రోజులు పాటు స్వామివారి కల్యాణ మహోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలు వాడపల్లి దివ్య క్షేత్రంలో జరగనున్నాయని దేవస్థానం ఈవో చక్రధర్ రావు తెలిపారు. పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు స్వామివారి ప్రసాదం, ఎండల నేపథ్యంలో చల్లటి మజ్జిగ ఎక్కడికక్కడ చలి వేంద్రాల సైతం ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *