అడవిలో మొదలైన బంధం.. ఎలుగుబంటి పిల్లతో గిరిజనుడి బంధం.. కంటతడి పెట్టించే కథ..! Araku Doravalasa tribal man bear bond exposes fight. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

అరకు దొరవలసలో గిరిజనుడు నెమలి కన్నయ్య కాపాడిన ఎలుగుబంటి పిల్లతో ఏర్పడిన అనుబంధం చట్టపరమైన అడ్డంకులతో పరీక్షకు గురై సోషల్ మీడియాలో వైరల్.

+

నన్ను

నన్ను తరలించకండి గిరిజనులు వద్ద కన్నీరు పెట్టుకుంటున్న ఎలుగుబంటి

అడవిలో పుట్టిన ఒక బంధం.. మనసును కదిలించే ఒక కథగా మారింది. అరకు పరిసరాల్లో చోటుచేసుకున్న ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. ఒక గిరిజనుడు, ఒక అడవి జంతువు మధ్య ఏర్పడిన అనుబంధం ఎంత గాఢమో, ఎంత నిజమో ఈ ఘటన స్పష్టంగా చెబుతోంది.

దొరవలస గ్రామానికి చెందిన నెమలి కన్నయ్య అనే గిరిజనుడు తన జీవన విధానంలో ఎలాంటి స్వార్థం లేకుండా ప్రకృతితో కలిసిమెలిసి జీవిస్తున్నాడు. కానీ అతని జీవితంలో అనుకోకుండా ప్రవేశించిన ఒక చిన్న ఎలుగుబంటి ఇప్పుడు అతని కుటుంబ సభ్యుడిలా మారిపోయింది. ఒక గొయ్యిలో పడిపోయిన ఈ చిన్న జంతువును కాపాడిన రోజునుంచి వారి మధ్య బంధం ప్రారంభమైంది.

కాఫీ తోటల్లో పని చేస్తూ ఉండగా గొయ్యిలో పడిపోయిన ఎలుగుబంటి పిల్లను గమనించిన కన్నయ్య దానిని బయటకు తీసి ప్రాణాలు కాపాడాడు. అక్కడే వదిలేస్తే ఇతర జంతువులు హాని చేస్తాయనే భయంతో ఇంటికి తీసుకెళ్లి ఆహారం పెట్టి సంరక్షించాడు. తర్వాత అడవిలోకి వదిలినా, ఆ జంతువు మళ్లీ కన్నయ్య దగ్గరికి తిరిగి రావడం మొదలైంది. ఇలా ఒక్కసారి కాదు, పలుమార్లు జరిగిన ఈ సంఘటనతో అది చివరకు అతని ఇంటి సభ్యుడిగానే మారిపోయింది.

దాదాపు ఏడాది కాలంగా ఆ ఎలుగుబంటి పిల్లను తన బిడ్డలా చూసుకుంటూ పెంచుతున్నాడు కన్నయ్య. “దానికి అన్నం పెడతాను.. అది నాతోనే ఉంటుంది.. ఇదే మా బంధం అని అతను చెప్పిన మాటలు అక్కడి వారందరినీ భావోద్వేగానికి గురిచేశాయి. అయితే చట్టపరంగా అడవి జంతువులను పెంచుకోవడం అనుమతి లేనందున అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

గ్రామస్థులు ఈ జంతువు వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినా, అధికారులు దానిని తరలించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జూకు తరలిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో ఆ ఎలుగుబంటి కూడా కన్నయ్యను విడిచి వెళ్లాల్సి వస్తుందనే భావంతో మౌనంగా కనిపించడమే కాకుండా, కన్నయ్య కన్నీరు పెట్టుకోవడం అక్కడి వాతావరణాన్ని మరింత విషాదంగా మార్చింది.

మానవత్వం, ప్రేమకు హద్దులు లేవని ఈ ఘటన మరోసారి నిరూపించింది. అడవి జంతువుపై చూపిన ఈ గిరిజనుడి మమకారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి మనసులను తాకుతోంది. చట్టం ఒకవైపు.. ప్రేమ మరోవైపు.. ఈ బంధం చివరకు ఏ దిశలో సాగుతుందో అన్నది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *