Last Updated:
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కే రాజధాని అమరావతి అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాసనసభ ప్రత్యేక సమావేశంలో ప్రసంగిస్తూ, అమరావతికి చట్టబద్ధత ఇవ్వడం ద్వారా భవిష్యత్‌లో ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయని ఆయన చెప్పారు. శాతవాహనుల నుంచి అమరావతి పాలితమయ్యిందని, బ్రిటీష్ మ్యూజియంలో కూడా అమరావతి గ్యాలరీ ఉందని గుర్తుచేశారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కే రాజధాని అమరావతి అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాసనసభ ప్రత్యేక సమావేశంలో ప్రసంగిస్తూ, అమరావతికి చట్టబద్ధత ఇవ్వడం ద్వారా భవిష్యత్‌లో ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయని ఆయన చెప్పారు. శాతవాహనుల నుంచి అమరావతి పాలితమయ్యిందని, బ్రిటీష్ మ్యూజియంలో కూడా అమరావతి గ్యాలరీ ఉందని గుర్తుచేశారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే మొదటి భాషాపరమైన రాష్ట్రం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ ఉంటే పరిస్థితులు వేరే విధంగా ఉండేవని పేర్కొన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘తెలుగువాళ్లను మదరాసీలు అనేవారు. తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించడానికి ఎన్టీఆర్ పోరాడారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతో ఆ ముద్ర పోయింది. ప్రాంతీయ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లాం. 1991లో ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. వాటిని మనం అందుకున్నాం. ఇంటర్నెట్ విప్లవాన్ని అందుకున్నాం. తెలంగాణ ఆదాయంలో 75 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. తెలుగు జాతి ఐటీలో భాగస్వామ్యం కావాలని ఉద్దేశంతో హైదరాబాద్‌లో సైబరాబాద్ నిర్మించాం. నాడు వేసిన పునాదే నేటి తరం ఉపయోగిస్తున్నది’’ అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని సీఎం చంద్రబాబు వివరించారు. విభజన తర్వాత ఏపీకి కార్యాలయాలు లేకపోవడం, బస్సులో పాలన చేయాల్సి రావడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పారు. 9 నెలల్లోనే సచివాలయం, అసెంబ్లీ భవనాలను పూర్తి చేసి చూపించామన్నారు. సింగపూర్ కంటే మెరుగైన రాజధానిని నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు. తెలుగు ప్రజలందరూ ఒక్కటే అని, వివక్ష చూపించడం సరిగా లేదని.. అమరావతిని అభివృద్ధి చేస్తామని స్పష్టంగా తెలిపారు.
రాజధానిపై జగన్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని, మూడు రాజధానుల కుట్రను శాసనమండలిలో అడ్డుకున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు రైతులు 33 వేల ఎకరాల భూములను స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. వైసీపీ అమరావతిపై కుట్రలు చేసి, నిర్మాణానికి డబ్బులు ఇవ్వకుండా ప్రపంచ బ్యాంక్‌కు లేఖలు రాశారని ధ్వజమెత్తారు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదికలను కూల్చి, అమరావతి నిర్మాణాన్ని నిలిపివేసినట్లు చంద్రబాబు విమర్శించారు.
‘‘ఏపీకి ద్రోహం చేసిన పార్టీ వైసీపీ. 2028 నాటికి అమరావతిలో మెజార్టీ పనులు పూర్తి చేస్తాం. ప్రస్తుతం రూ.56,000 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. వైసీపీవి అవే కుట్రలు, అవే కుతంత్రాలు చేస్తున్నారు. రాష్ట్రంలో అమరావతి ఒక్కే రాజధాని. దీన్ని ఎవరూ తాకలేరు. అమరావతి చట్టబద్ధతను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతాం. పార్లమెంట్ ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారుతుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



