ఇప్పటి వరకు విజయవంతంగా నిర్వహించిన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను మరింత విస్తరించి, ఈసారి వివిధ విభాగాల విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఇంజినీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, కామర్స్, మాస్ కమ్యూనికేషన్ వంటి విభాగాల్లో చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన విషయాలను ప్రాక్టికల్‌గా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.



