Road Safety: వైజాగ్ రైడర్స్ జాగ్రత్త.. మీ స్పీడ్‌ను పట్టుకునేందుకు ‘లేజర్ గన్స్’ వచ్చేశాయ్.. రూల్స్ అతిక్రమిస్తే చలానా బాదుడే! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

నగరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ కృషితో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ రెండు స్పీడ్ లేజర్ గన్స్ అందజేశారు.

విశాఖలో రోడ్లపై స్పీడ్ వెళ్తున్నారా..! ఈ లెజర్ స్పీడ్ గన్ మీకు చలానా వేస్తుంది 
విశాఖలో రోడ్లపై స్పీడ్ వెళ్తున్నారా..! ఈ లెజర్ స్పీడ్ గన్ మీకు చలానా వేస్తుంది 

అతివేగం ప్రమాదకరమని, ఎన్నిచోట్లసైను బోర్డులు కనిపిస్తున్నా, అధికారులు ఎన్నిరకాలుగా అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు మాత్రం పట్టించుకోవడం లేదని, యువత స్పీడ్ గా వెళ్తేనే కిక్కు అనుకుంటూ హైస్పీడ్ వెళ్లి అదే స్పీడ్లో ప్రమాదాలకు గురవుతున్నారని, నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ అన్నారు.

సీపీ బాగ్చీ రహదారి భద్రతకు సంబంధించి నగరంలో ఇటీ వల చాలా మార్పులు తీసుకువచ్చారు. నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి సంబంధించి నగరంలో వివిధ జంక్షన్లలో పగలు, రాత్రి సమయాల్లో ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్ చేసి వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి చలానాలు విధిస్తున్నారు.

రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో వాహనాలు రాకపోకలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో మరింత సమర్థవంతంగా ఎలక్ట్రానిక్ ఆధారిత ఎన్ఫోర్స్మెంట్ చేయాలనే సంకల్పంతో సీపీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతనను సంప్రదించి స్పీడ్ లేజర్ గన్ ను తమకు కేటాయించాలని కోరారు. దీంతో జీవీఎంసీ కమిషనర్ సుమారు రూ.18 లక్షల విలువచేసే రెండు స్పీడ్ లేజర్ గన్స్ విశాఖ ట్రాఫిక్ పోలీసులకు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అందజేశారు.

స్పీడ్ లేజర్ గన్స్ తో అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనం నడిపే వారిని, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపే వారిని, ద్విచక్ర వాహనంపై హెల్మెట్ లేకుండా వెనుక కూర్చున్న వారిని, ఒకే మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించడం, వ్యతిరేక మార్గంలో వాహానాన్ని నడపడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలను 100 మీటర్ల దూరం నుండే పసిగట్టి వారి వివరాలను నిక్షిప్తం చేసుకుని, వారికి చలానాలు విధిస్తామని తెలిపారు.

నగరంలో ట్రాఫిక్ వ్యవస్థను సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి తమ వంతు సహాయం అందజేసిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్కు సీపీ బాగ్చీ కృతజ్ఞతలు తెలిపారు. మరొక స్పీడ్ లేజర్ గన్ను సౌత్ ఏసీయన్ ఎల్.పి.జి. సంస్థ మంజూరు చేసిందని అది మరికొద్ది రోజుల్లో నగర పోలీసులకు అందజేస్తారని దీని విలువ సుమారు 18 లక్షలు ఉంటుందని సీపీ తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *