అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం, ఎర్రంరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీరేణుకా ఎల్లమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భక్తిశ్రద్ధలతో జరగాల్సిన జాతరలో కొందరు నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేశారు. యువతులతో అసభ్యకరంగా నృత్యాలు చేయించడంపై గ్రామస్తులు, భక్తులు మండిపడుతున్నారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఇటువంటి అశ్లీల ప్రదర్శనలు సంస్కృతిని మంటగలుపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల పర్యవేక్షణ లోపించిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
Source link
Annamayya district | శ్రీరేణుకా ఎల్లమ్మ జాతరలో రికార్డింగ్ డ్యాన్సుల రచ్చ..


