Bus Accident: మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Markapuram Bus Accident: మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన విషాదకర బస్సు ప్రమాదంపై రాష్ట్ర కేబినెట్ సమీక్ష నిర్వహించింది. మృతులకు గాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

cbn
cbn

Markapuram Bus Accident: మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన విషాదకర బస్సు ప్రమాదంపై రాష్ట్ర కేబినెట్ సమీక్ష నిర్వహించింది. మృతులకు గాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

గాయపడిన వారికి అందుతున్న వైద్య చికిత్సను మంత్రులు, అధికారులు సమీక్షిస్తూ మెరుగైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ (ఆర్&బీ), రవాణా, పోలీస్, ఆరోగ్య శాఖలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదనంగా ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది.

అసలేం జరిగింది: గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీ వద్ద లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ను హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగి తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉండగా, కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఉదయం 5 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదం సమయంలో ఎక్కువ మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. ఆకస్మికంగా మంటలు వ్యాపించడంతో ఏమి జరుగుతోందో అర్థం కాక చాలామంది చిక్కుకుపోయారు. బస్సు ముందు భాగం నుంచి మంటలు చెలరేగడంతో బయటపడటం కష్టంగా మారింది. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి, పలువురిని కిటికీల ద్వారా బయటకు దించారు. ఇంకా బస్సులో మరికొంతమంది మృతదేహాలు ఉండే అవకాశం ఉందని సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

జగిత్యాల నుంచి వింజమూరుకు వెళ్తున్న ఈ బస్సు ప్రమాదానికి గురైంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రయాణికుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన, విషాదాన్ని కలిగించింది. గాయపడిన వారికి మార్కాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల అసలు కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు—బస్సు టిప్పర్‌ను ఢీకొట్టిందా, లేక టిప్పరే బస్సును ఢీకొట్టిందా అనే దానిపై స్పష్టతకు ప్రయత్నిస్తున్నారు.

ప్రమాదం అనంతరం టిప్పర్ బోల్తా పడి, అందులోని కంకర రాళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. దీనితో ప్రమాదం తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థమవుతోంది. బస్సు, టిప్పర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు డ్రైవర్ల గుర్తింపుతో పాటు వాహనాల ఫిట్‌నెస్‌పై కూడా పరిశీలన చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *