చెత్తతో చరిత్ర సృష్టించండి..! “వేస్ట్ టు వండర్” పోటీలకు భారీ బహుమతులు..! GVMC Waste to Wonder Championship. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

జీవీఎంసీ Waste to Wonder Championship ద్వారా స్క్రాప్‌తో శిల్పాలు సృష్టించి Brand Vizag Green Vizag లక్ష్యాలతో విశాఖ నగర సౌందర్యం పెంచే వినూత్న పోటీలు.

జీవీఎంసీ “వేస్ట్ టు వండర్” ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం.. జీవీఎంసీ అన్ని జోన్లల
జీవీఎంసీ “వేస్ట్ టు వండర్” ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం.. జీవీఎంసీ అన్ని జోన్లల

విశాఖ నగరాన్ని సృజనాత్మకతతో పాటు పర్యావరణ పరిరక్షణలో ముందంజలో నిలిపే లక్ష్యంతో జీవీఎంసీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వేస్ట్ టు వండర్ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. నగరంలోని పనికిరాని స్క్రాప్ వస్తువులను కళాఖండాలుగా మలచి నగరానికి కొత్త అందాన్ని తీసుకురావాలని ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 కార్యక్రమంలో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఈ తరహా పోటీలు నిర్వహించడం విశేషం.

వెల్డింగ్ షాపులు, ఫ్యాబ్రికేషన్ యూనిట్లు, స్వతంత్ర మెటల్ కళాకారులకు ఇది అరుదైన అవకాశం. సాధారణంగా వ్యర్థంగా భావించే ఇనుప స్క్రాప్, ఆటో వేస్ట్ వంటి పదార్థాలను వినియోగించి 4 నుంచి 8 అడుగుల ఎత్తు కలిగిన శిల్పాలను తయారు చేయాలని జీవీఎంసీ సూచించింది. కనీసం 80 శాతం వరకు స్క్రాప్ మెటీరియల్ వినియోగం తప్పనిసరి. ఈ కళాఖండాలు నగర ప్రధాన కూడళ్లలో ప్రతిష్ఠించబడతాయని ప్రకటించడంతో కళాకారుల్లో ఉత్సాహం నెలకొంది.

ఈ పోటీలకు నగరంలోని అన్ని జోన్లలో పాల్గొనే అవకాశం కల్పించారు. ప్రతి జోన్‌లో ప్రథమ బహుమతి రూ.1 లక్ష, ద్వితీయ బహుమతి రూ.50 వేల, తృతీయ బహుమతి రూ.25 వేలుగా నిర్ణయించారు. అదనంగా 10 మంది ప్రతిభావంతులకు ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున నగదు బహుమతులు అందించనున్నారు. మొత్తంగా అన్ని జోన్లలో కలిపి రూ.22 లక్షల 50 వేల నగదు బహుమతులు ఇవ్వనున్నారు. పాల్గొనే వారందరికీ ధ్రువపత్రాలు కూడా అందజేయనున్నారు.

పోటీల్లో పాల్గొనదలచిన వారు తమ కళాఖండాలను 2026 ఏప్రిల్ 10లోగా జీవీఎంసీకి సమర్పించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు ఆన్‌లైన్ ద్వారా లేదా అధికారిక పోస్టర్‌లో ఉన్న QR కోడ్ ద్వారా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు సంబంధిత వార్డు సచివాలయాల్లోని శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీలను సంప్రదించాలని సూచించారు.

పర్యావరణ పరిరక్షణతో పాటు సృజనాత్మకతను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. వ్యర్థాలను ఉపయోగకరమైన కళాఖండాలుగా మార్చడం ద్వారా నగర సౌందర్యం పెంపొందుతుందని, బ్రాండ్ వైజాగ్, గ్రీన్ వైజాగ్ లక్ష్యాలకు ఇది బలాన్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో కళాకారులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోటీలు కేవలం బహుమతులకే పరిమితం కాకుండా, కళాకారులకు నగరంలో గుర్తింపు తెచ్చే వేదికగా నిలవనున్నాయి. వ్యర్థాన్ని విలువైనదిగా మార్చే ఆలోచనతో ముందుకు వస్తున్న ఈ కార్యక్రమం విశాఖలో కొత్త ట్రెండ్‌ను సృష్టించే అవకాశముంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *