వ్యవసాయ రంగంలో మల్చింగ్ పేపర్ కీలక పాత్ర పోషిస్తోంది. దీనిని ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడి, కలుపు నివారణ, సమయం ఆదా, కూలీల ఖర్చు తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గతంలో పెద్ద ఎత్తున సాగు చేసే రైతులు మాత్రమే మల్చింగ్ వాడేవారు. కానీ ఇప్పుడు చిన్న రైతులు కూడా మంచి దిగుబడుల కోసం మల్చింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్లాస్టిక్ ధరలపై పడటంతో, మల్చింగ్ పేపర్ ధరలు ఒక్కసారిగా పెరిగి రైతన్నలకు భారంగా మారాయి.



