Last Updated:
Organ Donation: ఆ కుటుంబం పెద్దదిక్కు కోల్పోయిన బాధలో ఉండి కూడా నలుగురు జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశయంతో అవయవ దానం చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
Organ Donation: ఆ కుటుంబం పెద్దదిక్కు కోల్పోయిన బాధలో ఉండి కూడా నలుగురు జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశయంతో అవయవ దానం చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. విశాఖ నగరం పెద గంట్యాడ కు చెందిన ధర్మాల మాధవరావు స్టీల్ ప్లాంట్ల లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా డ్యూటీ చేస్తున్నారు. 57 సంవత్సరాల ఈ పెద్దాయనకు ఈనెల 20వ తేదీన గాజువాక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయం కావడంతో నగరంలోని ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. తలలో తీవ్ర రక్తస్రావం జరగటంతో రక్షించేందుకు ఆస్పత్రి వైద్య బృందం తీవ్రంగా శ్రమించినప్పటికీ అతడి ఆరోగ్యం క్షీణించటం తో సోమవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్య బృందం ప్రకటించారు.
వైద్య బృందం వారి కుటుంబ సభ్యులకు బంధువులకు అవయవదానం గురించి అవగాహన కల్పించారు. కుటుంబ సభ్యులు అవయవ దానానికి అంగీకారం తెలపడంతో బ్రెయిన్ డెడ్ అయిన మాధవరావు శరీరంలోని లీవర్, కిడ్నీ, రెండు కార్నియాలు స్వీకరించారు. జీవన్ దాన్ ప్రోటోకాల్ ప్రకారం సీనియార్టీ లిస్టును అనుసరించి ఇతరులకు ఈ అవయవాలు దానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఆర్గాన్స్ కేటాయించారు. నలుగురు జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని మాధవరావు కుటుంబ సభ్యులు తెలిపారు.
అవయవ దానం చేసి నలుగురు జీవితాల్లో నూతన వెలుగును నింపిన మాధవరావు మృతదేహానికి పోలీస్ బ్యాండ్ ప్రదర్శించి ఘన వీడ్కోలు పలికారు. మాధవరావు పార్థవ దేహానికి సిపి శంఖ బ్రత బాగ్చి, జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కే రాంబాబు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవయవ దానం చేసి ప్రజలకు స్ఫూర్తి నింపిన వారికి ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా వీడ్కోలు పలికే విధంగా జీవో నెంబర్ 95 ను జారీచేసిన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అవయవదానానికి ప్రోత్సహించిన వైద్య బృందానికి.. అవయవ దానంకు ముందుకు వచ్చిన అతడి కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ప్రాణపాయస్థితిలో ఉన్న ఏ వ్యక్తి అవయవాలైనా ఇతరులను బ్రతికించడానికి ఉపయోగపడాలని.. ఆ ఆలోచనతోనే వారి కుటుంబ సభ్యులు అవయవదానంపై అవగాహన కల్పించాలని పోలీసులు, వైద్యులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh
Mar 24, 2026 11:13 AM IST



