Viral News: మటన్ ఉడకలేదని కంప్లైంట్.. స్టేషన్‌లో పోలీసులకు ఫ్యూజులు ఔట్ | ట్రెండింగ్


Last Updated:

Viral News: అనంతపురం జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఉగాది పండుగ నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

+

తాడిపత్రిలో

తాడిపత్రిలో విచిత్రం ..మటన్ ఉడకలేదని పోలీస్ మెట్లు ఎక్కిన వ్యక్తి.. 

Viral News: అనంతపురం జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఉగాది పండుగ నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాడిపత్రికి చెందిన సోడాలా హాజీ ఆదివారం మార్కెట్‌కి వెళ్లి మటన్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఆ మటను వండేందుకు ప్రయత్నించినప్పుడు ఆశ్చర్యకరమైన పరిస్థితి ఎదురైంది. సాధారణంగా కొద్ది సేపట్లో ఉడికే మటన్, ఎంతసేపు ఉడికించినా మెత్తగా ఉడకలేదు. మొదట అది సాధారణ సమస్యగా భావించిన సోడాలా హాజీ , మళ్లీ మళ్లీ వండే ప్రయత్నం చేశాడు.

మటన్ తిందామంటే..

మటన్ తినాలనే మక్కువతో సుమారు 20 సార్లు ఉడికించినప్పటికీ మేక మాంసం ఉడకకపోవడంతో అతనికి అనుమానం కలిగింది. తాను కొనుగోలు చేసిన మటన్ నాణ్యతపై సందేహం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో విక్రయదారుడిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్న అతను వండిన మటన్ ఉన్న పాత్రతో సహా నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. ఈ దృశ్యం చూసిన పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఉడకకపోవడంతో పోలీస్ కంప్లైంట్..

పోలీసులకు తన సమస్యను వివరించిన ఆ వ్యక్తి, తాను మోసపోయానని, విక్రయదారుడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న పోలీసులు, అతనికి వివరించి నచ్చజెప్పారు. ఇలాంటి విషయాల్లో ముందుగా విక్రేతతో మాట్లాడాలని సూచించారు. సాధారణంగా మాంసం ఉడకకపోతే కొట్టు యజమానిని అడుగుతాం. కానీ ఈ వ్యక్తి నేరుగా తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. తనకి అమ్మిన మటన్ ముదురు మాంసం అని, అది అస్సలు ఉడకడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.తాను డబ్బులు పెట్టి కొన్నానని, నాకు న్యాయం చేయాలని కోరాడు.

వైరల్ అవుతున్న వార్త..

పోలీసుల స్పందన ఈ వింత ఫిర్యాదు చూసి పోలీసులు మొదట ఆశ్చర్యపోయారు. మటన్ ఉడకకపోవడం అనేది సివిల్ లేదా క్రిమినల్ నేరం కిందకు రాదని అతనికి నచ్చజెప్పారు. ఇలాంటి చిన్న విషయాలకు పోలీస్ స్టేషన్‌కు రాకూడదని అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు.ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “మటన్ ఉడకకపోతే పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం ఏంటి సామీ!” అంటూ జోకులు పేలుతున్నాయి.ఈ ఘటన స్థానికంగా హాస్యాస్పదంగా మారడంతో పాటు, సోషల్ మీడియాలో కూడా చర్చకు దారితీసింది. “ఉడకని మటన్” కథ ప్రస్తుతం ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ ఫిర్యాదు తర్వాత హాజీకి మటన్ విక్రయించిన వ్యాపారి తిరిగి నాణ్యమైన కేజీ మటన్ అదనంగా డబ్బులు తీసుకోకుండా ఇవ్వడంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త ఇంకా వైరల్ అవుతోంది. అన్నీ ప్లాట్ ఫామ్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *