ఈ ల్యాబ్‌లో 6,000 చదరపు అడుగులు రసాయన విశ్లేషణకు, మరో 6,000 చదరపు అడుగులు సూక్ష్మజీవ విశ్లేషణకు కేటాయించారు. GC/GC-MS, HPLC/LC-MS, AAS/ICP-MS వంటి అత్యాధునిక పరికరాలతో పాటు ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్ అనలైజర్లు, బ్యూటిరో రిఫ్రాక్టోమీటర్, యూవీ-విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్ వంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆహారం నీటి నాణ్యతను ఖచ్చితంగా అంచనా వేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.



