Live News Today: దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధికి వేగం పెంచుతోంది. అన్ని రాష్ట్రాల్లో పాత విమానాశ్రయాలను ఆధునీకరిస్తూ, కొత్త ఎయిర్‌పోర్టులను కూడా నిర్మిస్తోంది. ప్రతి 45 రోజులకు ఒక విమానాశ్రయాన్ని ప్రారంభిస్తూ, దేశీయ మరియు అంతర్జాతీయ కనెక్టివిటీని బలోపేతం చేస్తోంది.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో అవసరమైన ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశాలలో ఒకటిగా ఎదుగుతోందని తెలిపారు. దేశం సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నందున ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పై కేంద్రీకృతమైందన్నారు.
ప్రతి 45 రోజులకు ఒక విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నామని, ఉడాన్ పథకం ద్వారా సాధారణ ప్రజలకు కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.


