Grocery Prices: బయట మార్కెట్‌తో పోలిస్తే అక్కడ సగం రేటే.. కందిపప్పు, బియ్యం, నూనె ఏదైనా..! | బిజినెస్


Last Updated:

Visakhapatnam: యుద్ధం కారణంగా బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు, బియ్యం ధరలు పెరుగుతూ చాలామందికి అందనంత దూరంలో ఉన్నాయి. ఆ ధరల్ని కాస్త తగ్గిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అక్కడ భారీగా తగ్గింపు ధరలే నిత్యవసరాలు అందుబాటులో ఉన్నాయి.

+

Visakhapatnam

Visakhapatnam

Visakhapatnam: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం పాక్షికంగా నిత్యవసరాలపై కూడా పడుతోంది. నిత్యం ఇంట్లో కావలసిన ఆహార పదార్ధాలైన బియ్యం, కందిపప్పు నూనె ధరలు కొద్ది కొద్దిగా పెరుగుతున్నాయి. మరో నెల రోజుల్లో వీటి ధరలు అమాంతం పెరిగి భారీ స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. కందిపప్పు ధరలు, బియ్యం ధరలు పెరుగుతూ చాలామందికి అందనంత దూరంలో ఉన్నాయి. ఆ ధరల్ని కాస్త తగ్గిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుందని విశాఖ రైతు బజార్ రైతులు, సామాన్య వినియోగదారుల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విశాఖ ఎంవీపి కాలనీ రైతు బజార్‌ ఎస్టేట్ ఆఫీసర్ వరహాలు చెబుతున్నారు.

యుద్ధం ఎఫెక్ట్..

ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగినా దాని ప్రభావం భారతదేశంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడి ప్రజల దైనందిన జీవితంలో ఉపయోగించే నిత్యవసరాలు, ఉపయోగించే వస్తువులు, పదార్ధాలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అధిక భారాన్ని మోపుతున్నాయి. అయితే అందుకు ప్రత్యామ్నాయంగా కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా రైతుబజార్లలో దొరికే నిత్యవసరాలను అత్యంత తక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. విశాఖపట్నం రైతు బజార్‌లో కేవలం కందిపప్పు కిలో రూ.115 రూపాయలు. ఇక సన్న బియ్యం కిలో రూ.46. సామాన్యులకు కాస్తంత ఊరట కలిగించేలా నిత్యావసర వస్తువుల ధరలు సబ్సిడీల రూపంలో తగ్గుతున్నాయి. ఎప్పటికప్పుడు నిత్యావసరాల ధరలని తగ్గించే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉంది. తద్వారా సామాన్యులకి కాస్త ఖర్చు తగ్గి భారం దిగుతోంది.

రైతు బజార్లలో తక్కువే..

బహిరంగ మార్కెట్లో కిలో రూ.150 ఉన్న కందిపప్పు ధరను కేజీ రూ.115 కి అందించడం విశేషం. ఇది అధికారుల పర్యవేక్షణలో అన్ని రైతు బజార్‌ లలో విక్రయిస్తున్నారు. విశాఖలోని 22 రైతు బజార్లలో అటు కందిపప్పు, ఇటు బియ్యం ధరలు ఇలాగే ఉన్నందున అక్కడే కొనుగోలు చేయాలని రైతు బజార్‌ ఎస్టేట్ ఆఫీసర్ వరహాలు సూచిస్తున్నారు. నిత్యావసరాల ధరలు ఇక్కడ తగ్గుముఖం పడటంపై సామాన్యుడు ఆనందంగా ఉన్నాడనే చెప్పాలి. విశాఖ రైతు బజార్‌లలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందిపప్పు విక్రయ కేంద్రాల్లో సబ్సిడీ కందిపప్పు ధరలని పౌర సరఫరాల శాఖ తగ్గిస్తూ వస్తోంది. నిజానికి బహిరంగ మార్కెట్లో కందిపప్పును కొనే పరిస్థితి లేదు.

సూపర్ మార్కెట్లలో కొంటే అంతే..

చాలావరకు విశాఖపట్నంలోని ఓపెన్ మార్కెట్లో కందిపప్పు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాగే బియ్యం ధరలు కూడా తక్కువ లేవు. కేజీ రూ.65 దాటేలా ధరలు ఉన్నాయి. కేజీ ఎక్కడ కూడా రూ.50 తక్కువ పలకడం లేదు. ఇక రైతు బజార్‌లలో బియ్యం విక్రయాలు బస్తా తక్కువ ధరకే పలుకుతుంది. కేజీ రూ.46 రూపాయలు, అలాగే కేజీ రూ.45 రూపాయలకే బియ్యం లభిస్తున్నాయి. ఇదివరకు బియ్యం 48-50 రూపాయలు ఉండగా ఇప్పుడు ఆ ధరలని పౌర సరఫరాల శాఖ తగ్గిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం విశాఖ ఎంవిపి బజార్‌లో విక్రయాలు జోరుగా సాగుతున్నాయని తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్‌డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *