ఇప్పటి నుంచి మీసేవ కేంద్రాల ద్వారా మొత్తం తొమ్మిది రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయడం, కుటుంబ సభ్యులను చేర్చడం లేదా తొలగించడం, కార్డు విభజన వంటి సేవలు ఇందులో ఉన్నాయి. అదనంగా కార్డు వివరాల్లో మార్పులు చేయడం, ఆధార్ అనుసంధానం, డూప్లికేట్ కార్డు పొందడం, రేషన్ దుకాణాల మార్పు వంటి సేవలను కూడా సులభంగా పొందవచ్చు. ఈ విధంగా ఒకే వేదికపై అన్ని సేవలను అందించడం వల్ల ప్రజలకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా ఇది భావిస్తున్నారు.



