Ugadi: ఇక నుంచి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఉగాది పండుగ రోజునే.. కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Ugadi 2026: ప్రతి ఏడాది ఉగాది పండగ రోజే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు అందరికీ సీఎం చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. పరాభవ నామ సంవత్సరం ప్రజలు అందరికీ మంచి చేయాలని ఆయన ఆకాంక్షించారు.

ugadi
ugadi

Ugadi 2026: ప్రతి ఏడాది ఉగాది పండగ రోజే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు అందరికీ సీఎం చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. పరాభవ నామ సంవత్సరం ప్రజలు అందరికీ మంచి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది అంతా మంచి జరగాలని అందరం కోరుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారుు. ఉగాది పచ్చడి జీవితాన్ని ప్రతిబింబిస్తుందని.. తీపి, పులుపు, చేదు, వగరు, కారం వంటి రుచులు ఉంటాయని అన్నారు. జీవితంలో కష్టసుఖాలు, ఆనంద దుఃఖాలు లాగే ఈ రుచులన్నీ కలగలిసి ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

తెలుగు సంప్రదాయాలకు ప్రతిబింబం ఉగాది: 

తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉగాదిని అధికారికంగా నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ప్రతి ఒక్కరూ వేడుకగా ఉగాది జరుపుకుని పంచాంగ శ్రవణం చేస్తారన్నారు. ఈ సంవత్సరం 38 మందికి కళారత్న అవార్డులు, 122 మందికి ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారని తెలిపారు. వారి అందరికీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంస్కృతి వినూత్నం అయినదని అన్నారు. పండుగలు విభిన్నమైనవని, పండుగలు విభిన్నమైనవని, ప్రకృతిని ఆరాధించడం, ఆరోగ్యకరమైన జీవన విధానానికి ప్రతీకలుగా ఉంటాయని సీఎం స్పష్టం చేశారు.

మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించడం నా అదృష్టం: 

సంక్రాంతి మొదలుకొని అన్ని పండుగలకు విశిష్టత ఉందని సీఎం చంద్రబాబు వివరించారు. మన పండుగలు ఆరోగ్యకర జీవన శైలిని ప్రతిబింబిస్తాయని అన్నారు. మన పండుగలు ఆరోగ్యకర జీవన శైలిని ప్రతిబింబిస్తాయని చెప్పారు. నేల, ప్రకృతి, నీటిని పూజిస్తామని గుర్తు చేశారు. మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించే గౌరవం తనకు దక్కిందని ఆనందించారు. ఆ తదుపరి కృష్ణా పుష్కరాలు కూడా వస్తున్నాయన్నారు. నీటి పరిరక్షణ కోసం నీటి భద్రత విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, పర్యావరణం కోసం నీరు అవసరమని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రిజర్వాయర్లలో 65 శాతం నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. మే 15 నుంచే సాగుకు నీరు విడుదల చేస్తామని చెప్పారు. నారు మళ్లు వేసుకోవాలని ముందుగానే చెప్పిన ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అలాగే ఈ ఏడాది ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని చెప్పారు. దాదాపు 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముందుకు వెళుతున్నామని అన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *