Pawan Kalyan: గబ్బర్ సింగ్ కా బాప్ ఉస్తాద్ భగత్ సింగ్.. థియేటర్లలో ఫ్యాన్స్ పూనకాలే.. వీడియో వైరల్.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విశాఖలో సూపర్ హిట్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నాలు నటించారు.

+

విశాఖలో

విశాఖలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ

ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అంటూ విశాఖలో సినిమా చూసి వచ్చిన అభిమానులు చెబుతున్నారు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ కి ఇదే మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు అంటున్నారు. హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా భారీ కలెక్షన్స్ వస్తాయంటూ చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నాలు హీరోయిన్‌లుగా చాలా బాగా నటించారని అంటున్నారు.

ఈ సినిమాలో గబ్బర్ సింగ్ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాన్స్ మరోసారి ఈ మూవీలో చూపించారని అంటున్నారు. సినిమాలో ‘కాలరే ఎత్తరా’ పాట చాలా బాగుంది అంటూ అభిమానులు చెబుతున్నారు.  ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ని చాలా బాగా చూపించారంటూ చెబుతున్నారు. హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ ను చాలా బాగా హీరోయిక్‌గా చూపించారని అంటున్నారు. సినిమాలో థమన్ మ్యూజిక్ అదిరిపోయిందంటూ చెబుతున్నారు.

జై హింద్ అనే పదానికి అర్థం వచ్చేలా ఈ సినిమా ఉందంటూ మరికొంతమంది అభిమానులు చెబుతున్నారు. దేశ రక్షణ కోసం ఈ సినిమాలో చాలా బాగా చూపించారని అంటున్నారు. ముఖ్యంగా చెడు వ్యసనాలకు బానిసయ్యే యువతకు మంచి మెసేజ్ ఇచ్చారని అంటున్నారు. అన్ని క్యాటగిరీలలో ఈ సినిమా చాలా బాగుందని అంటున్నారు. మరి కొంతమంది అభిమానులు ఫస్టాఫ్ చాలా డల్ గా ఉందంటూ చెబుతున్నారు. ఇంటర్వెల్ అంత మజా లేదని అంటున్నారు. ఊహించిన స్థాయిలో సినిమా లేదంటూ చెబుతున్నారు. ఏదేమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఈ సినిమా చూడొచ్చు అంటూ చెబుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *