Last Updated:
కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు బస్సు ప్రయాణం ఉచితం చేసింది. 40% వైకల్యం ఉన్నవారికి మాత్రమే ఈ సౌకర్యం. పలమనేరు ఆర్టీసీ బస్టాండ్‌లో దివ్యాంగ శక్తి కార్యక్రమం ప్రారంభించారు.
ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో బస్ వీటిలో గతంలో దివ్యాంగులకు 50 శాతం రాయితీ ఉండేది. కానీ కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా ఉచితం చేశారు. గతంలో బస్ పాస్ ఉన్నవారు అదే బస్ పాస్ తో ప్రయాణం చేసుకోవచ్చు లేని వారు డిపో కౌంటర్‌కు వచ్చి దరఖాస్తు చేసుకుంటే చాలు నిమిషాల వ్యవధిలో బస్ పాస్ మంజూరు చేసే సౌలభ్యం ఏర్పాటు చేశామని తెలిపారు.
వైకల్యం 40 శాతం ఉన్నవారికి మాత్రమే ఈ 4 బస్సులో ఉచితం మన్నారు. గతంలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్/డీలక్స్ బస్సుల్లో ఉచిత ప్రయాణం (గతంలో 50% రాయితీ ఉన్నవారు ఈ పాస్‌తో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. దాన్ని 40 శాతం కు కుదించారు.
రాష్ట్రంలోని ప్రజలందరి ఆనందమే ప్రభుత్వ ధ్యేయంగా కూటమి పని చేస్తున్నదని పలమనేరు ఆర్డీవో భవాని పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్యాంగ శక్తి కార్యక్రమంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూటమి నాయకులతో కలిసి అధికారులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కొరకు ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందని అందులో భాగంగా గతంలో వికలాంగులకు 50% రాయితీతో ఆర్టీసీ బస్సులో ప్రయాణ సౌకర్యం కలిగించిందన్నారు.
అయితే ప్రస్తుతం దివ్యాంగ శక్తి కార్యక్రమంతో పూర్తి ఉచితంగా వికలాంగులు బస్సులలో ప్రయాణించేందుకు అవకాశం కల్పించిందన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు మరిన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుండడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ అవకాశాన్ని వికలాంగుల అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
అనంతరం బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వీ బాలాజీ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చెప్పిన హామీలతో పాటు చెప్పని కార్యక్రమాలను నెరవేరుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆదరించాలని పిలుపునిచ్చారు. దివ్యాంగ శక్తితో పాటు రంజాన్ సందర్భంగా ఇమామ్ లు మోజోన్లకు ఆరు నెలల గౌరవ వేతనాన్ని ఒకే దఫా అందించడం ఆనందదాయకమన్నారు. అనంతరం డిపో మేనేజర్, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు తదితరులు ప్రసంగించారు..
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


