News Updates Today: ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్న ఇరాన్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. ఇప్పటికే సుప్రీం లీడర్ ఖమేనీని కోల్పోయిన ఇరాన్, తాజాగా మరో కీలక నేతను కూడా కోల్పోయింది. ఇజ్రాయెల్ నిర్వహించిన తీవ్ర దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారికంగా వెల్లడించింది.
ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ఖతీబ్ మరణంతో ఇరాన్‌లో విషాద వాతావరణం నెలకొంది. అంతకుముందే ఇరాన్ సైనిక అధికారి అలీ లారిజాని మరణించగా, మరుసటి రోజే ఖతీబ్ మరణించడం దేశానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. అయినప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గే లక్షణాలు చూపకుండా, ప్రతిదాడులకు దిగుతోంది. తాజాగా ఖతర్, సౌదీపై కూడా దృష్టి సారించింది.


