Pet Bird Story: ఇంట్లో ఆ 2 చిలకలు చేసే సందడి పిల్లలు కూడా చేయరు.. ఆ ఫ్యామిలీకి ఆవే పాజిటివ్ ఎనర్జీ | ట్రెండింగ్


Last Updated:

Pet Bird Story: ఇంట్లో పిల్లలు ఉంటేనే సందడే అంటారు అందరు. కాని అదే స్థానంలో పచ్చని చిలకలు రెండు ఉంటే ఆ సందడి మరోలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఫ్యామిలీకి ఈ రెండు చిలకలే పాజిటివ్ ఎనర్జీ.

+

Parrot

Parrot Lovers

Pet Bird Story: పక్షులు, పావురాలను ప్రేమించే వ్యక్తులు, వాటిని పెంచుకునే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. కాకినాడకు చెందిన గృహిణి అనురాధ దంపతులు పక్షులపై తమకున్న ప్రేమను పంచుకునేందుకు రెండు రామ చిలుకలను పెంచుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే చాలా వరకు పక్షులు, లేదా చిలుకలు, పిట్టలు, పావురాలను ఇంటి బయట లేదంటే బాల్కనీలో వాటి కోసం ప్రత్యేకించి పంజరం లాంటి గూడు ఏర్పాటు చేయడం చూస్తాం. కాని అనురాధ దంపతులు విదేశీ బ్రీడ్‌కి చెందిన రెండు రామ చిలుకల్ని ఇంట్లో పెట్టుకొని మనుషుల్లా చూసుకుంటున్నారు. సొంత బిడ్డలను చూసుకున్నట్లుగా వాటికి నచ్చిన ఆహారం పెట్టడమే కాకుండా ఆడుకునే వస్తువులతో పాటు స్నానం, నిద్రపోవడం వంటి వాటిని కూడా ఓ టైమ్ ప్రకారం అలవాటు చేశారు.

పచ్చని చిలుకలు తోడకుంటే..

అనురాధ దంపతుల ఇంట్లో ఉన్న రెండు చిలుకలు సన్ కోనూర్ బ్రీడ్‌కి చెందినవి. ఈ రెండు చిలుకలను 6 నెలల క్రితం ఒక్కొక్కటి రూ.15వేలు ఖర్చు చేసి ఇంటికి తెచ్చుకున్నారు. సౌత్ అమెరికాలో ఎక్కువగా కనిపించే ఆఫ్రికా బ్రీడ్ చిలుకలు ఇవి. వీటికి అనురాధ దంపతులు బిట్టు, బంటు అని పేర్లు పెట్టారు. వీటి స్పెషల్ క్యారెక్టర్ ఏమిటంటే ఇవి 30-40 సంవత్సరాల వరకు జీవిస్తాయి. రోజుకు కొన్ని వందల కిలో మీటర్లు గాల్లో ఎగురుతూ ప్రయాణించగలవు. అనురాధ దంపతులు ఈ రెండు చిలుకలను సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. వాటికి రోజూ ఫ్రూట్స్, నట్స్ తో పాటు ఆకు కూరలు, సన్ ఫ్లవర్ సీడ్స్ పెడుతున్నారు.

ఫుల్ పాజిటివ్ ఎనర్జీ..

మాట్లాడలేకపోయినప్పటికి ఈ అందమైన చిలుకలు తమను ఇంట్లో పెట్టి కంటికి రెప్పలా చూసుకుంటున్న యజమానిపై అంతే ప్రేమను చూపిస్తున్నాయి. ఈ రెండు చిలుకలకు యజమాని అంటే ఎంత ఇష్టమంటే… పూజ చేస్తుంటే పూజ గదిలోనే ఉంటాయి. హాల్లో పని చేసుకుంటుంటే అక్కడే ఆడుకుంటాయి. పిల్లలు ఆడుకునే చిన్న చిన్న వస్తువులతో సోఫాలో ఆడుకుంటూ ఇంట్లో పిల్లలు కంటే ఎక్కువ అల్లరి చేస్తూ ఇంటిని ఎప్పుడూ సందడిగా ఉంచుతున్నాయి.

విడదీయలేని బంధం..

ఇక ఈ చిలుకల డైట్ స్పెషాలిటీ ఏమిటంటే స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టంగా తింటాయి. మనుషులు తిన్నట్లుగానే రాగి ఇడ్లీ, వడ, పులిహోరతో పాటు అప్పడాలు ,బాస్మతి రైస్‌తో చేసిన వెజిటెబుల్ బిర్యానీ కూడా తింటాయి. బిట్టు, బంటు పేరుతో పెంచుకుటున్న ఈ రెండు చిలుకలు ఇంట్లో పిల్లలతో సమానమని అంటున్నారు యజమాని అనురాధ. వీటిని పెంచుకోవడానికి తెచ్చుకున్న నాటి నుండి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ, మానసిక ప్రశాంతత పెరిగిందని అనురాధ దంపతులు లోకల్18తో పంచుకున్నారు. రోజూ ఉదయం 9-11 గంటల మధ్యలో వాటి కోసం పెట్టిన వాటర్ బౌల్‌లోనే స్నానం చేసి పడుకుంటాయని చెబుతున్నారు. రాత్రి పూట అరవడం, డిస్ట్రబ్ చేయవని తమ పెంపుడు చిలకల గురించి లోకల్18తో పంచుకున్నారు. మనుషుల్ని మనుషులే నమ్మని ఈరోజుల్లో మాటలు రాని పక్షిజాతికి చెందిన చిన్న చిలుకలు తమను పెంచుకుంటున్న యజమాని పట్ల చూపిస్తున్న అభిమానం,ప్రేమ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *