Last Updated:
AP POLITICS: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ వార్ కొనసాగుతుంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్లెక్కారు.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ వారు కొనసాగుతుంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్లెక్కారు. కోడిని కోస్తే జైల్లో పెట్టిన అధికారపార్టీ నేతలు మరి తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలు డ్రగ్స్‌కు ప్రధాన సూత్రధారులుగా మారితే మీరేం చేస్తున్నారు..? ఇదే న్యాయం చంద్రబాబు నాయుడుగారు అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఈ డ్రగ్స్ విషయానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ సైతం ఘాటుగానే స్పందించారు. ఏలూరు ప్రజలకు తన గురించి తెలుసు.. తప్పుడు కథనాలు నమ్మొద్దు, నేను తప్పు చేయలేదు, చెయ్యను కూడా అంటూ వివరణ ఇచ్చుకున్నారు. డిన్నర్‌కి ఆహ్వానిస్తే వెళ్లి మాట్లాడి వచ్చానంటూ సమర్ధించుకున్నారు. అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడుని సైతం వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఏపీలో ఒక వైపు డ్రగ్స్ మరోవైపు టిటిడిలో ఉన్న చిన్నపాటి వివాదాల నేపథ్యంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రతివిమర్శలతో అధికార కూటమి నేతలు, ప్రతిపక్ష వైసీపీ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది పరిస్థితి. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, ఏలూరు ఇలా ప్రధాన కేంద్రాలలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ వంగాగీత, మాజీ ఎమ్మెల్యేలు చీరల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా లాంటి వైసీపీ ముఖ్య నేతలంతా రోడ్డెక్కారు. నిరసనల హోరుతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడుని ఆ పదవి నుంచి తొలగించి.. తిరుమల తిరుపతి ప్రాముఖ్యతను కాపాడమని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరమ పవిత్రమైన తిరుమల కొండపై ఏం జరుగుతుందో గ్రహించి ఆయనని వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేశారు.
మరోపక్క కోడిని కోసిన వారిని జైల్లో పెట్టారు మరి డ్రగ్స్ పార్టీలో ప్రధానంగా ఉన్న టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ను ఏం చేశారు అంటూ ప్రశ్నించారు వైసీపీ నేతలు. పుట్టా మహేష్ యాదవ్ పై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చినీయాంశంగా మారింది. ఇలాంటి సమయంలో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. డ్రగ్స్ పార్టీ కేసులో తన పాత్ర లేదని చెప్పే ప్రయత్నం చేసుకున్నారు. అయినప్పటికి వైసీపీ నేతలు మహేష్ యాదవ్‌తో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని పట్టుబట్టారు.
కూటమి నేతలపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు అధికార పార్టీకి చెందిన నేతలు. నిరాధారమైన ఆరోపణలతో వైసీపీ నేతలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారంటూ కూటమి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే వైసీపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Kakinada,East Godavari,Andhra Pradesh
Mar 18, 2026 12:47 PM IST


