Gas Cylinder: ఏపీలో మరో 15 రోజులకు సరిపడా వంట గ్యాస్ నిల్వలు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

CM Chandrababu: రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్యాస్ సరఫరా పరిస్థితిపై మంగళవారం సమీక్ష నిర్వహించి, ప్రస్తుత నిల్వలు, భవిష్యత్ సరఫరాపై స్పష్టత ఇచ్చారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.

chandrababu
chandrababu

CM Chandrababu: రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్యాస్ సరఫరా పరిస్థితిపై మంగళవారం సమీక్ష నిర్వహించి, ప్రస్తుత నిల్వలు, భవిష్యత్ సరఫరాపై స్పష్టత ఇచ్చారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎస్ సాయిప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్ మరియు ఓఎన్‌జీసీ అధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. త్వరలో మరింత గ్యాస్ చేరుకోనుండటంతో సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని చెప్పారు. మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు మన దగ్గర ఉన్నాయని సీఎం చెప్పారు. ఇంకొన్ని గ్యాస్ నిల్వలు మరికొద్ది రోజుల్లో రాష్ట్రానికి రానుందని తెలిపారు.

అత్యవసర సేవలకు ప్రాధాన్యం ఇవ్వండి: 

అత్యవసర సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆసుపత్రులు, హాస్టళ్లు, ఆలయాలకు గ్యాస్ సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రజలకు గ్యాస్ త్వరగా అందేలా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సూచించారు. ఈకేవైసీ, ఓటీపీ విధానాల ద్వారా గ్యాస్ సిలిండర్లు నిజమైన లబ్ధిదారులకు చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎలాంటి దుర్వినియోగం లేదా డైవర్షన్ జరగకుండా పర్యవేక్షణ పెంచాలని ముఖ్యమంత్రి వివరించారు.

ఇండక్షన్ స్టవ్స్ వినియోగం పెంచండి: 

ఇంకా రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, వాటి లభ్యతను పెంచాలని ఆయన సూచించారు. గ్యాస్ కంపెనీలు తాత్కాలికంగా ఉత్పత్తి పెంచి పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.

కేజీ బేసిన్ సహజ వాయువును పైప్ లైన్ ద్వారా: 

సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటు, ఏపీలోని కేజీ బేసిన్ సహజ వాయువును పైప్‌లైన్ ద్వారా అందించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సీఎం చంద్రబాబు తగు సూచనలు చేశారు. అలాగే సీఎన్జీ, పీఎన్జీ వినియోగాన్ని మరింతగా పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *