Last Updated:
Heritage Foods: హెరిటేజ్ ఫుడ్స్‌కు చంద్రబాబు ప్రభుత్వం భారీగా రాయితీలు ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఓ కంపెనీగా దానికి రాయితీలు ఇవ్వడం అనేది ప్రభుత్వం సహజంగా చేసే ప్రక్రియే. కాకపోతే.. ఇక్కడ ఆ కంపెనీ.. చంద్రబాబు కుటుంబానిది కావడంతో.. అది చర్చగా మారింది. ఆ రాయితీల వివరాలు చూడండి.
మీరు హెరిటేజ్ పాలు, కర్రీ, యోగర్ట్ కొనేటప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పాల ఉత్పత్తుల వెనుక.. ప్రభుత్వ సపోర్ట్ ఎంత ఎక్కువగా ఉందో? ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌కు ఒక్కసారిగా రూ.59.69 కోట్ల టైలర్ మేడ్ రాయితీలు ఇచ్చేసింది! ఇది కేవలం ఒక కంపెనీకి సహాయం కాదు.. తిరుపతి చుట్టుపక్కల రైతులు, యువత, వినియోగదారులందరికీ ప్రయోజనం అనేది ప్రభుత్వ ప్లాన్. ఐతే.. ఇంతలా రాయితీలు ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ (4.0) 2024-29 ప్రకారం ప్రభుత్వం అధికారిక జీవోని జారీ చేసింది. ఆ జీవో.ఎం.ఎస్.నం.57 ఆధారంగా మనం పూర్తి వివరాలు, ప్రయోజనాలు, ప్రభావం అన్నీ తెలుసుకుందాం.
ప్రభుత్వం ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (FCI)లో 28.46% అంటే రూ.59.69 కోట్లను ఐదేళ్లలో చెల్లిస్తుంది. ఇది టైలర్ మేడ్ ప్యాకేజీ. వివరాలు ఇలా ఉన్నాయి:
1. టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ సబ్సిడీ: 25% వరకు ఉంది. ఇది రూ.34.93 కోట్లు. కొత్త మెషినరీ, ఆటోమేషన్ ఇందులోకి వస్తాయి.
2. 100% నెట్ SGST రీయంబర్స్‌మెంట్: ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్‌లో అమ్మకం అయితే ఐదేళ్లలో రూ.17.80 కోట్లు తిరిగి వస్తాయి.
3. పవర్ కాస్ట్ రీయంబర్స్‌మెంట్: యూనిట్‌కి రూ.1. ఇలా 5 సంవత్సరాలు ఇస్తున్నారు. తద్వారా రూ.0.98 కోట్లు రాయితీ వస్తుంది.
4. ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జెంప్షన్: యూనిట్‌కి రూ.1. ఇది కూడా 5 సంవత్సరాలు ఇస్తారు. మరో రూ.0.98 కోట్లు రాయితీ వస్తుంది.
5. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్: AHIDF టాప్-అప్ @2% ఇస్తారు. అది రూ.5.00 కోట్లు వస్తుంది.
మొత్తంగా విద్యుత్ రాయితీలే సుమారు రూ.2 కోట్ల దాకా ఉన్నాయని జీవో ద్వారా స్పష్టమవుతోంది.
హెరిటేజ్ ఫుడ్స్‌కు చంద్రబాబు భారీగా తాయిలాలు!
హెరిటేజ్ ఫుడ్స్‌కు చంద్రబాబు భారీగా తాయిలాలు!
ప్రభుత్వం DCP (డైరెక్ట్ క్యాష్ పేమెంట్?) ను కమర్షియల్ ఆపరేషన్స్ మొదలైన తర్వాత పరిగణించాలని సూచించింది. CEO, AP Food Processing Society, APIIC, ఇండస్ట్రీస్ డైరెక్టర్ అన్ని క్లియరెన్సులూ తీసుకొని 5 సంవత్సరాల్లో ఇన్‌సెంటివ్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది చంద్రబాబు ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌పై పెట్టిన నమ్మకంలా కనిపిస్తున్నా.. హెరిటేజ్ కంపెనీకే ఇంతలా భారీగా తాయిలాలు ఎందుకు ఇవ్వాలనే ప్రశ్నలు వైసీపీ నేతల నుంచి రావచ్చు. ఇటీవలే కల్తీ నెయ్యి విషయంలో హెరిటేజ్ గ్రూప్‌ని వైసీపీ టార్గెట్ చేసింది. ఇప్పుడు ఈ రాయితీలు ఎలాంటి వివాదాన్ని తెరపైకి తెస్తాయి అనేది మున్ముందు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



