ఇవాళ ఏమున్నాయి?
ఇరాన్ యుద్ధానికి 17 రోజులు పూర్తయ్యాయి. ఇవాళ 18వ రోజు కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ నేడు 2వ రోజు జరుగుతుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చిస్తారు. నేడు మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్తారు. సాయంత్రం సల్మాన్ ఖుర్షీద్ పుస్తకావిష్కరణకు హాజరవుతారు. శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. చిత్తూరు జిల్లా నగరిలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ప్రాంగణంలో నేడు జాబ్ మేళా ఉంది. నెల్లూరు జిల్లా మనుబోలులోని సీఆర్ఆర్ (CRR) కళ్యాణ మండపంలో ఇవాళ జాబ్‌మేళా ఉంది. నేడు భారత్ మార్కెట్లో Vivo T5x 5G మొబైల్ రిలీజ్ అవుతుంది. అలాగే.. ఆల్ న్యూ 2026 రెనాల్ట్ డస్టర్.. హైబ్రీడ్ పవర్‌తో ఇవాళ లాంచ్ అవుతుంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.


