Simhachalam Temple: సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వర్ణ శోభ.. ధ్వజస్తంభం పీఠానికి బంగారు తాపడ పనులు ప్రారంభం! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం పీఠానికి స్వర్ణ తాపడం పనులు ప్రారంభమయ్యాయి. జె. వెంకట్రావు, టి.పి. రాజగోపాల్, శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు.

సింహాచల క్షేత్రంలో ధ్వజస్తంభ పీఠానికి స్వర్ణ తాపడం
సింహాచల క్షేత్రంలో ధ్వజస్తంభ పీఠానికి స్వర్ణ తాపడం

ఉత్తరాంధ్ర ప్రజల కోరిన కోరికలు తీర్చే స్వామివారు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయం ముందున్న ధ్వజస్తంభం పీఠానికి పూర్తిస్థాయిలో స్వర్ణ తాపడం (బంగారు పూత) చేసే పనులు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.

​​ఆలయ కార్యనిర్వహణాధికారి  జె. వెంకట్రావు కొబ్బరికాయ కొట్టి స్వర్ణ తాపడ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు గారి ఆధ్వర్యంలో పీఠం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఏడేళ్ల క్రితం నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో సీఎంఆర్ (CMR) సంస్థ సుమారు రూ. 1.8 కోట్లు వెచ్చించి ధ్వజస్తంభానికి స్వర్ణ తాపడం చేయించింది. ఇప్పుడు అదే సంస్థ ధ్వజస్తంభం అడుగు భాగంలోని పీఠానికి స్వర్ణ తాపడం చేసేందుకు ముందుకు వచ్చింది. పీఠానికి ఎంత బంగారం అవసరమవుతుందనే దానిపై కార్మికులు ఇప్పటికే కొలతలు తీసుకోవడం ప్రారంభించారు.

త్వరలోనే ఈ పనులను పూర్తి చేసి ధ్వజస్తంభాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.​ ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు, పర్యవేక్షణ అధికారి బి. సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *