Ugadi Brahmotsavam 2026: మలన్న దర్శనం కోసం ఎండలో వందల కిలో మీటర్ల కాలినడక.. శ్రీశైలంకి కన్నప్పలు |


Last Updated:

Ugadi Brahmotsavam 2026: ఏపీలోని ద్వాదశ జ్యోతిర్గింగ క్షేత్రంగా శ్రీభ్రమరాంభిక మల్లికార్జునస్వామి కొలువైన ఆలయంగా విరాజిల్లుతోంది. అయితే ఏటా శివరాత్రి ఉత్సవాలతో పాటు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉగాది మహోత్సవాలు ఈఏడాది మార్చి 16 నుండి 20వ తేది వరకు కొనసాగుతాయి.

+

Ugadi

Ugadi Brahmotsavam 2026

Ugadi Brahmotsavam 2026: ఆంధ్రప్రదేశ్‌లోని ద్వాదశ జ్యోతిర్గింగ క్షేత్రంగా శ్రీభ్రమరాంభిక మల్లికార్జునస్వామి కొలువైన ఆలయంగా విరాజిల్లుతోంది. అయితే ఏటా శివరాత్రి ఉత్సవాలతో పాటు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉగాది మహోత్సవాలు ఈఏడాది మార్చి 16 నుండి 20వ తేది వరకు కొనసాగుతాయి. 5రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో స్వామి, అమ్మవార్లకు విశేషసేవలు, అలంకారాలు జరుగుతాయి. ఈ మహోత్సవాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వేలాది మంది భక్తులు కాలినడకన (పాదయాత్రగా)శ్రీశైలానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం వేసవి తాపం 40 డిగ్రీలకు పైగా ఎండ మండుతున్నప్పటికి పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఆడ మగ తేడా లేకుండా ఆ మల్లన్నస్వామిని దర్శించుకోవడానికి వందల కిలోమీటర్ల దూరం నుండి వస్తున్నారు. కాళ్లకు బొబ్బలు వచ్చినా, శరీరం అలసి పోయినా భక్తిభావనతో ముందుకు సాగిపోతున్నారు.

కొండపైకి కన్నప్పలు..

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే ఏడు కొండలు ఎక్కాలి. అదే శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవాలంటే ఆడవి మార్గంలో గుట్టలు, కొండలు, ఎండని తట్టుకొని దర్శించుకోవాల్సి ఉంటుంది. అందులో శ్రీశైలంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగే సమయంలో భక్తులు లక్షలాదిగా తరలివస్తుంటారు. ఈనెల 16 నుండి 20 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను తిలకించడానికి కర్నాటక రాష్ట్రంలోని కన్నడిగులు కన్నప్పను దర్శించుకోవడానికి పాదయాత్రగా 300-400 కిలోమీటర్ల దూరం నుండి వస్తున్నారు. అటవీ మార్గాలైన వెంకటాపురం, భీమునికొలను మీదుగా క్షేత్రానికి చేరుకుంటున్నారు.

అడవిలో భక్తితో..

మండిపోతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో (EO) ఎస్. శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మార్గం మధ్యలో మజ్జిగ, మంచినీళ్లతో పాటు అల్పాహారం అందజేస్తున్నారు. ఇక ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేస్తున్నారు. క్యూ లైన్లలో, అటవీ మార్గాల్లో భక్తులకు ఎండ తగలకుండా చలువ పందిళ్లు వేశారు.

ఎండను సైతం లెక్క చేయకుండా..

కర్నాటక నుండి వచ్చే కన్నడ భక్తులు శ్రీశైలంలో కొలువైన భ్రమరాంబ దేవిని తమ ఇంటి ఆడపడుచుగా,మల్లికార్జున స్వామిని తమ ఇంటి అల్లుడిగా భావిస్తారు.అందుకే ప్రతి సంవత్సరం ఉగాది సమయానికి లక్షలాది మంది కన్నడిగులు వేసవి ఎండలను భరించి పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటారు. కొంతమంది భక్తులు సుమారు నెల రోజులపాటు పాదయాత్ర చేస్తూ శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారు.

ఉగాది మహోత్సవాలు..

వందల మైళ్ల దూరం నుంచి వచ్చే భక్తులు నీరసం, అస్వస్థతకు గురైతే చికిత్స అందించడానికి ఎక్కడిక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అత్యవసర చికిత్స కోసం ముఖ్యమైన పాయింట్ల వద్ద వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. కన్నడ భక్తులకు మార్గనిర్దేశం చేసేందుకు కన్నడ భాష తెలిసిన వాలంటీర్లను అదనంగా నియమించారు. ఉత్సవాల రద్దీ కారణంగా మార్చి 16 నుంచి 20 వరకు గర్భాలయ స్పర్శ దర్శనాలు నిలిపివేయబడతాయి. కేవలం అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది.

మార్చి 16 నుండి 5రోజుల పాటు ఉగాది మహోత్సవాలు 

ఈనెల 16న ధ్వజారోహణంతో ఉత్సవాల ప్రారంభం. బృంగి వాహన సేవ, అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం.

మార్చి 17న కైలాస వాహన సేవ, అమ్మవారికి మహాదుర్గ అలంకారం.

మార్చి 18న నంది వాహన సేవ, అమ్మవారికి మహాసరస్వతీ అలంకారం. రాత్రి వేళ వీరాచార విన్యాసాలు మరియు అగ్నిగుండ ప్రవేశం (కర్ణాటక భక్తుల ప్రత్యేక ఆచారం).

మార్చి 19 (ఉగాది): తెల్లవారుజామున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు. ఉదయం పంచాంగ శ్రవణం, సాయంత్రం అత్యంత వైభవంగా రథోత్సవం.

మార్చి 20: ధ్వజావరోహణంతో ఉత్సవాల ముగింపు.

భారీ ఏర్పాట్లు..

శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు జరిగిన అసౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి మరింత జాగ్రత్తగా ఏర్పాట్లు చేసారు ఆలయ అధికారులు. భక్తులు కూడా వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సహాకరించాలని కోరుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *