Last Updated:
Pawan Kalyan: గిరిజనుల కష్టాలను చూసి రహదారుల నిర్మాణానికి ముందు కొచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం కనీసం సమస్యలు విన్న పరిస్థితులు కూడా లేవని పేర్కొన్నారు. అల్లూరి జిల్లా నందిగరువులో గిరిజనులతో పవన్ కల్యాణ్ మాటా మంతీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Pawan Kalyan: గిరిజనుల కష్టాలను చూసి రహదారుల నిర్మాణానికి ముందు కొచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం కనీసం సమస్యలు విన్న పరిస్థితులు కూడా లేవని పేర్కొన్నారు. అల్లూరి జిల్లా నందిగరువులో గిరిజనులతో పవన్ కల్యాణ్ మాటా మంతీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సరైన రహదారి లేకుండా గిరిజనులు ఇబ్బంది పడుతుంటే చూసి తట్టుకోలేకపోయానని అన్నారు.
ఎవరికి ఏ సమస్య ఉన్నా తనతో పంచుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరారు. ప్రజల కష్టాలు తీర్చేందుకే కూటమి ప్రభుత్వం ఉందని ఆయన భరోసా కల్పించారు. అంతకుముందు ఓనూరులో జల జీవన్ మిషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిని డిప్యూటీ సీఎం పరిశీలన చేశారు. అంగన్వాడీ సెంటర్‌ను సందర్శించి పరిశీలించారు. అక్కడ గర్భిణీలకు పౌష్టికాహారం అందించారు. అక్కడి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. వారికి బ్యాగులు సైతం పంపిణీ అందజేశారు.

“ఏ సమస్య ఉన్నా తనతో పంచుకోవచ్చు. ప్రజల కష్టాలను తీర్చేందుకే కూటమి ప్రభుత్వం సిద్ధం. సరైన రహదారి లేక నందగరువు గిరిజనులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. తాను మాత్రం తట్టుకోలేకపోయాను. గిరిజనుల కష్టాలు చూసి రహదారి నిర్మాణానికి ముందుకు వచ్చాను. ఎవరికైనా ఏ సమస్య ఉన్నా నేరుగా తనతో పంచుకోవాలని కోరుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించడానికే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని భరోసా ఇచ్చారు.” – పవన్ కల్యాణ్, ఉపముఖ్యమంత్రి
సమస్యలు ఏవైనా రాత్రికి రాత్రే పరిష్కారం కావు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కానీ పరిష్కరించాలనే సంకల్పం మాకుందని, ప్రధానమంత్రి నిధులతోనే ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం సాధ్యమైందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ నిధులు ఏం అయ్యాయో మీరు నాయకులను నిలదీయాలని సూచించారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే 460 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించామని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా నిధులు కేటాయిస్తున్నామన్నారు. నాయకులకు ఈ ప్రాంతాలకు రావాలంటేనే భయం.. కానీ నేను ప్రజల కోసం పని చేసే వ్యక్తిని ఎవరికి భయపడను అని తెలిపారు. మీ సమస్యలు తెలుసుకోవడానికి ముందుకు వచ్చానని ఆయన చెప్పారు.
ఈ నందిగరువు గ్రామస్థుల విన్నపం మేరకు కొత్త స్కూల్, 1.6 కిలోమీటర్ల మేర నూతన రోడ్డు నిర్మాణంతో, అంగన్ వాడీ కేంద్రంతో పాటు గ్రామంలో మ్యాజిక్ డ్రైన్లను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంజూరు చేశారు. సుమారు 3 వేల గ్రామాలకు తాగు నీరు అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధికి కీలకమైన జీవో నంబరు 3 పునరుద్ధరణపై సీఎం చంద్రబాబుతో చర్చించి సానుకూల నిర్ణయం వెలువరిస్తామని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



