​Simhachalam Temple: సింహగిరిపై డిజిటల్ విప్లవం.. అప్పన్న దర్శనం కోసం సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ టికెట్స్ | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

Simhachalam Temple: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే సింహాచల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు శుభవార్త తెలిపింది ఆలయ పాలక మండలి.

Simhachalam Temple
Simhachalam Temple

Simhachalam Temple: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే సింహాచల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు శుభవార్త తెలిపింది ఆలయ పాలక మండలి. ఇకపై సింహగిరిపై కొలువైన నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు దర్శన టికెట్ల కోసం క్యూలో నిలబడక్కర్లేదు. బస్టాండ్ , PRO ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ కియోస్క్ల ద్వారా QR కోడ్ స్కాన్ చేసి వెంటనే టికెట్ పొందవచ్చు. కరూర్ వైశ్యా బ్యాంక్ సహకారంతో ఈ వినూత్న సేవలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి.

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు..

ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రం వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలంలో గంటల తరబడి టికెట్ కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా క్షణాల్లో దర్శన టికెట్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. భక్తులు తమ మొబైల్ ద్వారా నేరుగా QR కోడ్ స్కాన్ చేసి టికెట్లు పొందే అత్యాధునిక సదుపాయం కల్పించారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఈ మెషిన్లను విరాళంగా అందించిన కరూర్ వైశ్యా బ్యాంక్  అందజేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొండపైన బస్టాండ్ మరియు PRO కార్యాలయ ఆవరణలో కియోస్క్ సెంటర్ల ఏర్పాటు చేశారు.

అత్యాధునిక సేవలు..

ఈ నూతన సేవలను ఆలయ ఈఓ శ్రీ జె. వెంకట్రావు ప్రారంభించి భక్తులకు అంకితం చేసారు. ఆ తర్వాత మాట్లాడుతూ భక్తుల సమయాన్ని ఆదా చేస్తూ, ఒత్తిడి లేని దర్శన భాగ్యాన్ని కల్పించడమే దేవస్థానం లక్ష్యం అని అన్నారు.​ భక్తుల కోసం మరిన్ని వినూత్న డిజిటల్ సేవలను తీసుకువస్తామని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ తిరుమలేశ్వర్రావు, KVB డివిజనల్ మేనేజర్ మురళీకృష్ణ, సీనియర్ మేనేజర్ మూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు.

భక్తులకు మెరుగైన సేవలు..

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో ఆయా దేవాలయాల్లో అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో భాగంగానే తిరుమలలో దర్శనం, లడ్డూ ప్రసాదం కోసం ఏటీఎంలు ఏర్పాటు చేశారు.రాబోయే రోజుల్లో శ్రీశైలం, సింహాచలంలో కూడా వీటిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *