ఇవాళ ఏమున్నాయి?
ఇరాన్ యుద్ధానికి 13 రోజులు పూర్తి అయ్యాయి. ఇవాళ 14వ రోజు కొనసాగుతోంది. మూసీ పునరుజ్జీవంపై సీఎం రేవంత్ నేడు ప్రజంటేషన్ ఇస్తారు. ఏపీలో కేబినెట్ సమావేశం జరుగుతుంది. నేడు అన్ని శాఖల అధిపతులతో ఏపీ ఆర్థిక శాఖ భేటీ అయ్యి.. ఖాళీలపై చర్చించి.. జాబ్ కేలండర్ రూపొందిస్తుంది. నేడు, రేపు అసోం పర్యటనలో ప్రధాని మోదీ ఉంటారు. నేటి సాయంత్రం పీఎం కిసాన్ 22వ విడత మనీ అవుతుంది. ఏపీలో అన్నదాత సుఖీభవ+పీఎం కిసాన్ కింద రూ.6,000 రైతుల అకౌంట్లలో జమ అవుతాయి. తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ ఇకపై పూర్తిగా ఆన్‌లైన్.. నేటి నుంచే అమలు. ‘తెలంగాణ నిరుద్యోగ జేఏసీ’ అధ్వర్యంలో నేడు నిరుద్యోగ మార్చ్ ఉంటుంది. జాబ్ కేలండర్ డిమాండ్‌తో. తెలుగు కవయిత్రి మొల్ల జయంతి నేడు. ఇది ఏపీలో రాష్ట్ర పండుగ. వేడుకలు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతాయి. పలాసలో నేడు తొలి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరుగుతుంది. ఉద్దానం ప్రజల కల సాకారం అవుతుంది. నేడు కోనసీమ జిల్లా, అమలాపురం లోని VIKASA ఆఫీస్ దగ్గర జాబ్ మేళా ఉంది. 1000కి పైగా ఉద్యోగాలు ఉంటాయి. నేడు నో స్మోకింగ్ డే. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.


