Shocking News: చనిపోతానంటూ భర్తను బెదిరించిన భార్య.. తర్వాత ఏం జరిగిందో తెలిసి అంతా షాక్ | ట్రెండింగ్


Last Updated:

Shocking News: భార్యభర్తల మధ్య ఉన్న గొడవలకు అభం శుభం తెలియని వాళ్ల పిల్లలు బలైపోతున్న పరిస్థితులు అధికమవుతున్నాయి. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఓ చిన్నారి ప్రాణం పోవడానికి తల్లిదండ్రులు కారణమయ్యారు.

+

భర్తను

భర్తను బెదిరించేందుకు భార్య స్కెచ్ . ఆస్కెచ్ లో పడి చిన్నారి మృతి

Shocking News: భార్యాభర్తల మధ్య గొడవలు హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. అనుమానం, ఆధిపత్య ధోరణి, ఆర్ధిక సమస్యలు ఇలా ఏదో విషయంలో ఇద్దరి మధ్య ఉన్న గొడవలకు అభం శుభం తెలియని వాళ్ల పిల్లలు బలైపోతున్న పరిస్థితులు అధికమవుతున్నాయి. తాను బ్రతకనప్పుడు తన పిల్లలు కూడా ఉండకూడదనే ఆలోచనతో కొందరు పిల్లల్ని బలవంతంగా ప్రాణాలు తీస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు సమీపంలోని బుట్టాయిగూడెం మండలం అంతర్వేది గూడెంలో భర్తను బెదిరిద్దామని భార్య తెచ్చుకున్న పురుగుల మందు వాళ్ల బిడ్డ తాగడంతో ప్రాణాలు కోల్పోవడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

భర్తను బెదిరించాలని చూసిన భార్య..

ఆలుమగలు అంటే అన్ని విషయాల్లో సమానమని అర్ధం. అంతే కాదు ఏదైనా సమస్య, ఇబ్బందులు వస్తే దాన్ని పరిష్కరించుకోవడంలో ఇద్దరూ కలిసి పంచుకోవాలన్నదే మన హిందూ ధర్మ ఆచారం. అయితే ఆంధ్రప్రదేశ్ ఏలూరు సమీపంలోని బుట్టాయిగూడెం మండలం అంతర్వేది గూడెం ప్రాంతంలో ఓ అమానుష సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఓ దంపతుల మధ్య వచ్చిన విభేదాల నేపథ్యంలో ఓ వివాహిత భర్తను బెదిరించడానికి ఇంటికి పురుగుల మందును కూల్ డ్రింక్ డబ్బాలో పోసుకొని తీసుకొచ్చింది. భార్య భర్తను పురుగుల మందు తాగుతానని బెదిరించడంతో భర్త సర్ది చెప్పాడు. దీంతో విషయం అప్పటికి సద్దుమణిగింది. అయితే ఆ తర్వాత ఇలా జరుగుతుందని వాళ్లు గ్రహించలేకపోయారు.

పోయిన పసి ప్రాణం..

తాను భర్తను బెదిరించడానికి తీసుకొచ్చిన పురుగుల మందు కూల్ డ్రింక్ బాటిల్‌లో ఉండటంతో వాళ్ల కూతురు పూనం రితిక శ్రీ అనే ఐదేళ్ల చిన్నారి పురుగుల మందును తాగేసింది. అంతే పది నిమిషాల వ్యవధిలో నురగలు కక్కుకోని పడిపోయింది. వెంటనే బుట్టాయిగూడెం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 24 గంటల తర్వాత చిన్నారి రితికశ్రీ ప్రాణాలు విడిచింది. దీంతో కళ్ల ముందే ఆడుతూ పాడుతూ తిరిగే చిన్నారి కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగడం , ప్రాణాలు పోగొట్టుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలవించారు. నిజానికి భర్తను బెదిరించే క్రమంలో ఆ భార్య కాస్త జాగ్రత్త తీసుకుని ఉండి ఉంటే ఈ ప్రాణాల సైతం నిలబడేవి అంటూ ఇరుగుపొరుగు అంటున్నారు.

పేరెంట్స్ వల్లే..

ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో వివాహం అనంతరం లైఫ్ లీడ్ చేసే క్రమంలో వస్తున్న సమస్యలను ఎదుర్కోలేక పిల్లలను చంపేసుకుంటున్న పరిస్థితులు ఒక రకమైన వేదన గురిచేస్తుంటే, సంబంధం లేకుండా చిన్నారులు ఈ ఘటనలతో చనిపోతున్న పరిస్థితులుమరో రకమైనా వేదనకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. జరిగిన ఘటనపై ముట్టాయిగూడెం పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఏది ఏమైనా తల్లిదండ్రులు బాధ్యతయుతంగా ఉండాలంటూ పలువురు పేర్కొంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *