Rotten Eggs: కోడిగుడ్ల ధరలు తగ్గినా పిల్లలకు కుళ్లినవే పెడుతున్నారు.. ఎక్కడో ఈ వీడియో చూడండి | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

Rotten Eggs: రాష్ట్రంలో ఒక పక్క కోడిగుడ్ల ధర ఒక్కసారిగా పడిపోయిన పరిస్థితులు నెలకొంటుంటే, మరోపక్క అదే రాష్ట్రంలో వసతిగృహాల్లో విద్యార్థులకు కుళ్లిపోయిన కోడిగుడ్లు అందుతున్నాయి? దీంతో విద్యార్థులు ముందే చూసి మేల్కొన్నారు.

+

Rotten

Rotten Eggs

Rotten Eggs: రాష్ట్రంలో ఒక పక్క కోడిగుడ్ల ధర ఒక్కసారిగా పడిపోయిన పరిస్థితులు నెలకొంటుంటే, మరోపక్క అదే రాష్ట్రంలో వసతిగృహాల్లో విద్యార్థులకు కుళ్లిపోయిన కోడిగుడ్లు అందుతున్నాయి? దీంతో విద్యార్థులు ముందే చూసి మేల్కొన్నారు, లబోదిబోమంటున్నారు. నిజానికి ఆ నియోజకవర్గంలో నాణ్యత లేని భోజనం పెట్టకపోవడం, గుడ్లు సరిగ్గా లేకపోవడం, లాంటి ఘటన ఈ రెండు నెలల్లో ఇది మూడవ ఘటనగా చెప్పుకోవచ్చు. ఒకపక్క ముందస్తుగా అక్కడ మహిళ ఎమ్మెల్యే స్కూల్స్, వసతి గృహాలకు వెళ్తున్నారు. తర్వాత వార్నింగ్ ఇస్తున్నారు. అయినా ఏమాత్రం అక్కడ వసతి గృహాల్లో మార్పు కనిపించడం లేదంటూ పలువురు ఆరోపిస్తున్నారు. తాజగా కోడి గుడ్లు ఎక్కడ కుళ్లిపోయియి.. ఎమ్మెల్యే వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి? పూర్తి వివరాలు ఈస్టోరీలో ఉన్నాయి.

పడిపోయిన కోడిగుడ్డు ధర..

తూర్పు ఏజెన్సీకి సంబంధించి పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పేదల పట్ల ప్రభుత్వ సిబ్బంది చూపిస్తున్న చిన్నచూపు , నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రశాంతతకు మారుపేరైన పర్యాటక ప్రాంతంలో ఎంతోమంది గిరిపుత్రుల బిడ్డలు ఇక్కడున్న వసతి గృహాల్లో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. తాజాగా రెండు వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ లాంటి సమస్యలు రంపచోడవరం సమీప ప్రాంతాల్లో వచ్చేయని చెప్పుకోవచ్చు. స్వయంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి వసతి గృహాలకి చేరుకుని విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటం ఆడితే తస్మాత్ జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా నెలకొంది. అయినా అక్కడున్న వసతి గృహాల్లో అలాగే కొన్ని స్కూల్స్లో మాత్రం మార్పు కనిపించడం లేదంటూ పలువురు ఆరోపిస్తున్నారు.

కుళ్లిన గుడ్లు ఎలా పెడతారు..

దేవీపట్నం మండలం పోతవరం ఎంపీపీ పాఠశాలలో కోడిగుడ్లు పూర్తిగా కుళ్ళిపోయి నల్లగా మారిపోయిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ స్కూల్లో కోడి గుడ్లు కుళ్ళిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అని చెప్పుకోవచ్చు. దీంతో మంగళవారం మధ్యాహ్నం రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి అక్కడికి చేరుకుని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు పాడైన గుడ్లు పెడితే సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. నాణ్యత లేని ఫుడ్ పెట్టిన కఠిన చర్యలు తీసుకుంటామంటూ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఎండాకాలం కావడంతో ఎప్పటికప్పుడు కోడిగుడ్లు తెప్పించుకోవాలని, ఆహార విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రత్యేకంగా సూచించారు.

తీరు మార్చుకోండి..

ధరలు తగ్గినా, ఎమ్మెల్యే హెచ్చరించినప్పటికి అంగన్ వాడి సిబ్బంది తీరు మారడం లేదు. రాష్ట్రంలో కోడిగుడ్డు ధర ఒక్కసారిగా పతనం అయిపోయిన పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు ఏడు రూపాయల వరకు వెళ్లిన కోడిగుడ్డు ప్రస్తుతం హోల్‌సేల్‌లో నాలుగు రూపాయలకే అమ్ముతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎంత రేట్లు తగ్గుతున్న వసతి గృహాల్లో స్కూల్లో మాత్రం ఇలా కుళ్ళిపోయిన, పాడైపోయిన గుడ్లు పెట్టడం పట్ల సగటు ప్రజల సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయాలపై ప్రభుత్వం కాస్త సీరియస్ తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *