AP News Updates: ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వీరు దాదాపు 6 నెలల పాటూ పాలన సాగిస్తారు. లేదా ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యేవరకు ఈ విధుల్లో ఉంటారు. తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన ఉంటుంది. ఇందుకు సంబంధించి పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ నోటిఫికేషన్ ఇచ్చారు.


