Women Police Bravery: ఆ మహిళ ఎస్సై, MRO అంత సేవకులు.. ఆశ్చర్యపోయినా కలెక్టర్, ఎస్పీ భావోద్వేగం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

Women Police Bravery: ఆ ఇద్దరు మహిళ ఉద్యోగులు ప్రధాన ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఉద్యోగం అంటే ఆ చేశాంలే అని ముందుకు వెళ్లే ఈరోజుల్లో సమయం వచ్చినప్పుడు ఉద్యోగ బాధ్యత ఈ విధంగా ఉంటుంది.

+

ఆమహిళ

ఆమహిళ ఎస్సై ఎంఆర్ఓ అంత సేవకులా? ఆశ్చర్యపోయినా కలెక్టర్, ఎస్పీ భావోద్వేగం

Women Police Bravery: ఆ ఇద్దరు మహిళ ఉద్యోగులు ప్రధాన ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఉద్యోగం అంటే ఆ చేశాంలే అని ముందుకు వెళ్లే ఈరోజుల్లో సమయం వచ్చినప్పుడు ఉద్యోగ బాధ్యత ఈ విధంగా ఉంటుంది. అనేవిధంగా ఆ ఇద్దరు మహిళ ఉద్యోగులు సేవలు అందించారు. అది అలాంటి ఇలాంటి ఘటన కాదు. ఒక పక్క ప్రాణాలు పోతున్నాయి. మరోపక్క పోయిన ప్రాణాల కోసం ఆప్రాంతమంతా శ్లోకసముద్రంలో మునిగిపోతుంది. అలాంటి తరుణంలో ఎంతోమంది సహాయకులుగా సేవకులుగా ఉద్యోగులుగా అక్కడికి వచ్చినప్పటికీ, ఆ ఇద్దరు మహిళలు చేసిన సేవలు కోసం రాష్ట్రమంతా ఇప్పుడు చెప్పుకుంటుంది. ఇలాంటి తరుణంలో వారిద్దరిని గుర్తించి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ సైతం మహానుభావుల సమక్షంలో సత్కార కార్యక్రమాలు నిర్వహించారు. ఇంతకీ ఆ ఇద్దరు మహిళ ఉద్యోగులు ఎవరు? వారు చేసిన ఉత్తమ సేవెంటీ ఒకసారి క్లుప్తంగా చూద్దాం.

కలచి వేసిన సంఘటన..

ఏపీకి సంబంధించి కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో గతవారం రోజుల కిందట మందుగుండు సామాగ్రి గోడాంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటంలో ఇప్పటివరకు 28 మందికి పైగా ప్రాణాలు విడిచారు. అయితే ఆరోజు స్పాట్లో 20 మంది ప్రాణాలు విడిచారు. ప్రమాదం జరిగిన వెంటనే అన్ని శాఖల అధికారులు అక్కడికి చేరుకుని సేవలు ప్రారంభించారు. ఇలాంటి తరుణంలో అక్కడ వచ్చే దుర్వాసన, ముఖ్యంగా కాలిపోయిన మృతదేహాలను ముట్టుకోవాలంటే భయం, మరోపక్క పట్టుకుంటే ముక్కలుగా చేతిలోకి వచ్చేయడం, ఇలాంటి తరుణంలో పెద్దాపురం మహిళా ఎస్సై మౌనిక అక్కడ ఉన్నవారిని ఆసుపత్రికి తరలించడం కాలిపోయిన మృతదేహాలను అంబులెన్స్ లోకి ఎక్కించడం, ఎక్కడ మృతదేహానికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా చేయడంలో ఆమె తనవృత్తిని అంకితభావంతో వందకి వంద శాతం న్యాయం చేశారని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు.

భావోద్వేగం..

అదేవిధంగా సామర్లకోట ఎంపిడిఓ హిమామహేశ్వరి సైతం అదే విధంగా సేవలో దూసుకుపోయారని తెలిపారు.నిజానికి ఒకగంట సేపు  ఉంటే సరిపోతుంది అని మహిళలు ఉండొచ్చు, కానీ ఈఇద్దరు మహిళలు చేసిన సేవలు అక్కడున్న పోలీసులు జిల్లా రెవెన్యూ అధికారులు సైతం ఆశ్చర్యపడే విధంగా ఉన్నాయని తెలిపారు. నిజానికి కష్టం వచ్చినప్పుడు ఒకఅధికారి ఇదే విధంగా ఉండాలని, అదే పోలీస్ తత్వం, అదే అధికార తత్వం అంటూ భావోద్వేగం గురయ్యే విధంగా కలెక్టర్ ఎస్పీ సైతం ప్రసంగించారు. ఏదిఏమైనా ఒక చిన్నస్థాయి ఉద్యోగి కష్టపడిన తర్వాత మరల వారికి తగిన గుర్తింపు నలుగురిలో వస్తే ఆ ఆనందమే వేరుని చెప్పుకోవచ్చు, తాజాగా మహిళా దినోత్సవం పురస్కరించుకుని కాకినాడలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పెద్దాపురం ఎస్ఐ మౌనిక సామర్లకోట ఎంపీడీవో హిమామహేశ్వరులను కలెక్టర్ ఎస్పీ మరియు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు సైతం ఘనంగా సత్కరించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *