Last Updated:
Elephant Death: తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నెరబైలు పంచాయతీ పరిధిలోని ఫారెస్ట్ బంగ్లా దగ్గర రెండు ఏనుగులు ప్రాణాలు విడిచాయి.
Elephant Death: అడవిలో ఉండాల్సిన క్రూరమృగాలు, వన్య ప్రాణులు జనావాసాల మధ్యకు వస్తే మృత్యువు తప్పదని మరోసారి రుజువైంది. ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల సంతతి అత్యధికంగా ఉండే ఉత్తరాంధ్ర, రాయలసీమలోని చిత్తూరు జిల్లాల్లో పలుమార్లు ఎనుగులు రోడ్లపైకి వచ్చి ఘీంకారాలు పెట్టి జనాన్ని పరుగులు పెట్టించిన దృశ్యాలు చూశాం. తాజాగా తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నెరబైలు పంచాయతీ పరిధిలోని ఫారెస్ట్ బంగ్లా సమీపంలోని అడవీ ప్రాంతంలో రెండు ఏనుగులు మృతి చెందాయి. ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు, అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అడవిలో సంచరిస్తున్న ఈ గజరాజులు అనుకోకుండా విద్యుత్ కంచెకు తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి భయపెడుతుంటే.. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గజరాజుల గుంపు దడ పుట్టిస్తోంది. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నెరబైలు పంచాయతీ పరిధిలోని ఫారెస్ట్ బంగ్లా సమీపంలోని విద్యుత్ కంచెలకు తగిలి రెండు ఏనుగులు మృత్యువాతపడ్డాయి.
అడవి ప్రాంతం నుండి నివాస ప్రాంతాలు, పొలల్లోకి తొరబడే అడవి పందుల దాడి నుంచి రక్షించుకునేందుకు స్థానిక రైతులు తమ పంటలను విద్యుత్ కంచెలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అదే కంచెకు తగిలి రెండు ఏనుగులు మృతిచెందినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని మృతిచెందిన ఏనుగులను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు.ఏ పరిస్థితుల్లో ఈ ఘటన జరిగింది, విద్యుత్ కంచె ఎలా ఏర్పాటు చేశారు అనే విషయాలపై అధికారులు విచారణ చేపట్టనున్నారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirupati,Chittoor,Andhra Pradesh
Mar 09, 2026 12:43 PM IST


