Tollywood: మీ అభిమానం తగలెయ్యా!.. భారీ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఎన్టీఆర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Jr NTR: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లిన ఫ్యాన్స్ మాత్రం తండోపతండాలుగా తరలివస్తారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన కిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వస్తున్నారని తెలిసి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆయనకు ఆసుపత్రి యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. తారక్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

image by x platform
image by x platform

Jr NTR: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లిన ఫ్యాన్స్ మాత్రం తండోపతండాలుగా తరలివస్తారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన కిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వస్తున్నారని తెలిసి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆయనకు ఆసుపత్రి యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. తారక్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత పబ్లిక్ కార్యక్రమంలో పాల్గొనడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. కర్ణాటక నలుమూలల నుంచి అభిమానులు బెంగళూరు చేరుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆయనను ప్రత్యక్షంగా చూడాలనే ఆత్రుతతో కార్యక్రమం ప్రాంగణం అభిమానులతో నిండిపోయింది. ఎయిర్‌పోర్ట్ నుంచి ఆసుపత్రి వరకు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయన కారు దిగిన వెంటనే అభిమానులు “సీఎం.. సీఎం..” అంటూ నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. భారీ ఫ్లెక్సీలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ అభిమాన నటుడికి ఘన స్వాగతం పలికారు.

jr ntr

image cedit by twitter

అభిమానుల రద్దీ కారణంగా బెంగళూరు నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మహాదేవపుర మరియు ఎలక్ట్రానిక్ సిటీ వైపు వెళ్లే ప్రధాన రహదారులు పూర్తిగా వాహనాలతో నిండిపోయాయి. దాదాపు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోలీసుల అంచనాలకు మించి అభిమానులు రావడంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ కష్టమైంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అదనపు సిబ్బందిని పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమంగా క్లియర్ చేసి సాధారణ పరిస్థితి తీసుకువచ్చారు.

ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతున్న సమయంలో లోపల కూడా అభిమానులు భారీగా చేరుకున్నారు. ఎన్టీఆర్‌ను దగ్గరగా చూడాలని అభిమానులు ముందుకు రావడంతో ఒక్కసారిగా తోపులాట వాతావరణం ఏర్పడింది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆసుపత్రిలోని ఎస్కలేటర్ వద్ద ఉన్న అద్దాలు పగిలిపోయాయి. జనం ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లడంతో కొందరు అభిమానులు కిందపడిపోయారు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ తోపులాటలో అక్కడే ఎన్టీఆర్ ఉన్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి తీవ్రమైన గాయాలు కాలేదని సమాచారం. పెద్ద ప్రమాదం జరగకుండా తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తైన అనంతరం ఎన్టీఆర్ అభిమానులకు అభివాదం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రహదారి పొడవున అభిమానులకు ఎన్టీఆర్ అభివాదం చేస్తూనే వెళ్లారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *