ప్రముఖ నటి జాన్వీ కపూర్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతి శుభకార్యానికి ముందు లేదా విశేష సమయాల్లో తిరుమల రావడం జాన్వీకి అలవాటు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఆమె మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయబద్ధమైన లంగా ఓణి ధరించి తెలుగుమ్మాయిలా మెరిసిపోయిన జాన్వీని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. అంతకుముందు ఆమె అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన కొండపైకి చేరుకున్నట్లు తెలుస్తోంది. తన తల్లి శ్రీదేవికి తిరుమల అంటే ఉన్న అపారమైన భక్తిని జాన్వీ కూడా అదే విధంగా కొనసాగిస్తుండటం విశేషం.
Source link
Janhvi Kapoor in Tirumala | అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు జాన్వీ కపూర్


