Tirumala: శ్రీవారి కొండపై ఈ కోతి పనులేంటి.. దివ్వెల మాధురి వీడియో వైరల్ | ట్రెండింగ్


Last Updated:

Tirumala: బిగ్‌బాస్ ఫేమ్, దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి తీరు ఇప్పుడు మరోసారి వివాదాస్పదమైంది. కోట్లాది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమలక్షేత్రాన్ని పుట్టినరోజు వేడుకలకు వేదికగా మార్చుకోవడం, అక్కడ నిబంధనలకు విరుద్దంగా వీడియోలు చిత్రీకరించి తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేయడంపై పాలకమండలి మరోసారి ఆమెను తప్పుపట్టింది.

Divvela Madhuri controversy
Divvela Madhuri controversy

Tirumala: బిగ్‌బాస్ ఫేమ్, దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి తీరు ఇప్పుడు మరోసారి వివాదాస్పదమైంది. కోట్లాది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమలక్షేత్రాన్ని పుట్టినరోజు వేడుకలకు వేదికగా మార్చుకోవడం, అక్కడ నిబంధనలకు విరుద్దంగా వీడియోలు చిత్రీకరించి తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేయడంపై పాలకమండలి మరోసారి ఆమెను తప్పుపట్టింది. దివ్వెల మాధురి, తనూజ అనే ఇద్దరు వ్యక్తులు నిన్న తిరుమలలో బర్త్ డే వేడుకలు చేసుకున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. తిరుమలలో ఇలాంటి వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధించడం జరిగింది.దివ్వెల మాధురి, తనూజలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

వైరల్ అవుతున్న వీడియో..

పబ్లిసిటీ కోసం పాకులాడే వ్యక్తులు తమకు జనంలో తమ ఇమేజ్ పెంచుకునేందుకు ఎలాంటి పనులైనా చేస్తారు. ఎలాంటి పవిత్ర ప్రదేశంలో అయినా నిబంధనలు పాటించరు అనే విషయం తాజాగా మరోసారి తేలిపోయింది. బిగ్ బాస్ ఫేమ్ తనుజ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి. శ్రీవారి దర్శనార్థం నిన్న తిరుమలకు చేరుకున్న ఈ ముగ్గురు ఇవాళ ఉదయం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

దివ్వెల మాధురి ఓవర్ యాక్షన్..

అయితే ఇవాళ తనుజ పుట్టినరోజు సందర్భంగా నిన్న రాత్రి తిరుమల కొండపై ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో కేక్ కటింగ్ ను నిర్వహించి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.సాధారణంగా భక్తులు తిరుమల కొండకు కేక్ తీసుకుని వెళ్లాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.కేవలం ఎగ్లెస్ కేక్ మాత్రమే తిరుమల కొండ కు అనుమతిస్తారు. అయితే వీళ్లకు కేకు తీసుకెళ్లేందుకు అనుమతి ఉందా లేదని టీటీడీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

కొండపై ఈ కోతి పనులేంటి..

మరోపక్క ఇప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ దివ్య మాధురికి వివాహం కాకపోవడం వారి ఇద్దరికే కలిసి తిరుమల కొండపై గదులు కేటాయించడం పై సర్వత్ర విమర్శలకు తావిస్తోంది. గతంలో కూడా ఇలాగే ఇద్దరూ పట్టు వస్త్రాలతో ఆలయ ప్రాంగణంలో భార్యభర్తల తరహాలో రీల్స్ చేసి వివాదాల్లో చిక్కుకున్న విషయాన్ని విస్మరించక ముందే మరోసారి అలాంటి ఘనకార్యమే వెలగబెట్టారు. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, తనూజ ప్రవర్తించిన తీరు కొండపైకి వచ్చే కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నట్లుగా టీటీడీ భావిస్తోంది. ఇందులో భాగంగానే వీళ్ల ముగ్గురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

ముగ్గురిపై చర్యలు..

దివ్వెల మాధురి, తనూజ అనే ఇద్దరు వ్యక్తులు నిన్న తిరుమలలో బర్త్ డే వేడుకలు చేసుకున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. తిరుమలలో ఇలాంటి వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధించడం జరిగింది. అయితే బర్త్ డే కేక్ కట్ చేయడమే కాకుండా ఆమె ఆ వీడియో చిత్రీకరించి సోషియల్ మీడియాలో పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించింది టీటీడీ.వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ పోలీసులుకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు సదరు ఘటనపై విచారణ చేస్తున్నారు.

తిరుమలలో రీల్స్ చేసిన కేసులో కోర్టుకు హాజరు

ఇదిలా ఉంటే తిరుమలలో రీల్స్ చేసిన కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి గురువారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో కలసి కోర్టుకు వచ్చిన ఆమె రెండవ అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి కోటేశ్వర రావు ఎదుట హాజరయ్యారు. తిరుమల వన్ టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను మాధురికి అందజేశారు. మే నెల 12న ఇద్దరు జామీనుదారులతో పాటు జామీను పత్రాలను అందజేయాలని కోర్టు ఆదేశించింది. మాధురి తరపున న్యాయవాది ఇరుగు రమేష్ వాదించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *