Mohan Babu University: మొన్న భువన నేడు హర్షవర్ధన్.. మోహన్ బాబు యూనివర్సిటీలో స్టూడెంట్స్ సూసైడ్ కలకలం |


Last Updated:

Mohan Babu University: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామిరెడ్డిపల్లి గ్రామంలో ఓ రూమ్ రెంట్‌కి తీసుకొని ఉంటున్న విద్యార్థి హర్షవర్దన్ రెడ్డి ఫ్యాన్‌కి ఉరివేసుకొని చనిపోయాడు.

Mohan Babu University
Mohan Babu University

Mohan Babu University: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామిరెడ్డిపల్లి గ్రామంలో ఓ రూమ్ రెంట్‌కి తీసుకొని ఉంటున్న విద్యార్థి హర్షవర్దన్ రెడ్డి ఫ్యాన్‌కి ఉరివేసుకొని చనిపోయాడు. హర్షవర్ధన్ సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఈయర్ చదువుతున్నాడు. బలవన్మరణం చేసుకున్న స్టూడెంట్ స్వస్థలం కడప జిల్లా. హర్షవర్ధన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గమనించిన సహచర విద్యార్థులు స్థానికులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సూసైడ్‌కి కారణాలు..?

హర్షవర్ధన్ రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బీటెక్ ఫైనల్ ఈయర్ చదువుతున్న స్టూడెంట్ ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనే సందేహంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. వ్యక్తిగత సమస్యల వల్లనా, చదువుల ఒత్తిడి కారణమా, లేక ఇతర కారణాలున్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

రెండో వారాల్లో ఇద్దరు..

విద్యార్థి గది నుండి ఎలాంటి సూసైడ్ నోట్ లభించిందా అనే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. గత నెల 24న భువన అనే డేటా సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కూడా హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇటీవల మోహన్ బాబు యూనివర్సిటీలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో అక్కడ చదువుతున్న విద్యార్థుల్లో భయాందోళన నెలకొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విశ్వవిద్యాలయ వర్గాలు కూడా ఈ ఘటనపై ఆరా తీస్తున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *