కదిరి కొండపై శ్రీ ఖాద్రి లక్ష్మీనారసింహస్వామి జ్యోతి.. పున్నమి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

అనంతపురం: కదిరి కొండపై శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి ఆధ్వర్యంలో అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. పున్నమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా, కొమ్మరవాండ్లపల్లి గ్రామంలోని కదిరి కొండపై జరిగింది.

క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ఇక్కడ కొండల లక్ష్మీ నారసింహుడు, కాటమ రాయుడుగా స్తోత్రాద్రిపై మొదటగా పాదం మోపారని, అందుకే ఈ ప్రాంతానికి ఖాద్రీ పురం అనే పేరు వచ్చిందని పేర్కొన్నారు. భక్త ప్రహ్లాదుడు నరసింహ స్వామిని ప్రార్థించిన క్షేత్రంగా ఈ ప్రాంతాన్ని భక్తులు భావిస్తారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో 15 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందులో బ్రహ్మ గరుడ సేవ ప్రత్యేకతను సంతరించుకుంటుంది.

శ్రీ వారి భక్తులు ఈ రోజున కదిరి పున్నమిని జరుపుకుంటారు. జయ జయ సింహ, జయ నరసింహ అంటూ గోవింద నామస్మరణతో అఖండ జ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కొండపై అఖండ జ్యోతి వెలిగించడం వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సామాజిక కారణాలు ఉన్నాయని సేవాసమితి సభ్యులు తెలిపారు. జ్ఞానానికి, వెలుగుకు గుర్తుగా దీపం వెలిగిస్తారు. అజ్ఞానాన్ని పోగొట్టి, దైవచింతనను నింపాలని కోరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *