Viral Video: క్లాస్‌లో టీచర్‌ని ఎముకలు విరిగేలా కొట్టిన స్టూడెంట్.. ఎందుకో ఈ వీడియో చూడండి | ట్రెండింగ్


Last Updated:

Student Attacks Teacher: విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు దండించేవారు కర్రలతో కొట్టేవారు.కానీ నేటి కాలంలో విద్యార్థులు తప్పు చేసిన అడిగితే తిరిగి ఉపాధ్యాయులపై దాడి చేసే దయానీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి.

+

student

student attacks teacher

Student Attacks Teacher: గురుబ్రహ్మ,  గురువిష్ణు, గురుదేవో, మహేశ్వర అని పాఠం చెప్పే ఉపాధ్యాయుడిని, విద్య నేర్పించే గురువుని మహేశ్వరుడు గా కొలుస్తారు.నిజానికి వారు ఆశీస్సులు ఉంటేనే మనజీవితంలో లక్ష్యం సాధించి ముందుకు వెళ్ళగలమని సాక్షాత్తు భగవంతుడే పురాణ ఇతిహాసాల ద్వారా తెలియజేశారు.అయితే నాటికాలంలో విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు దండించేవారు కర్రలతో కొట్టేవారు.కానీ నేటి కాలంలో విద్యార్థులు తప్పు చేసిన అడిగితే తిరిగి ఉపాధ్యాయులపై దాడి చేసే దయానీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి.అదేం పని అని అడిగినందుకు ఆఉపాధ్యాయుడును ఎముకలు విరిగే విధంగా ఒక టెన్త్ విద్యార్థి కొడుతూ రాజసం చూపించాడు? ఆ నిమిషంలో ఆ ఉపాధ్యాయుని బాధపెట్టి ఆ విద్యార్థి గెలిచాడేమో గాని తర్వాత వీడియో చూసిన పలువురు అదేంపని, దేవుడిగా భావించే ఉపాధ్యాయుడిపై చేయి చేసుకుంటారా ఇదేనా మీపెంపకం అంటూ విద్యార్థులపై పలువురు అసహహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అలాంటి  ఘటన ఎక్కడ చూసి చేసుకుంది. అసలు ఏం జరిగింది

టీచర్‌ని కొట్టిన స్టూడెంట్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కృష్ణా జిల్లాలో ఉపాధ్యాయుడిపై విద్యార్థి దాడి చేసిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి  వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విద్యార్థి ఉపాధ్యాయుడిని కొట్టిన వీడియో ఆ సమయంలో ఉపాధ్యాయుడు ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు చెడు వ్యసనాలకి బానిసై తప్పుడు మార్గంలో ఉన్నారని గుర్తించిన ఉపాధ్యాయుడు ఆ విద్యార్థులను మందలించే ప్రయత్నం చేశారు.

కారణం ఇదే..

నిజానికి ఆ ఉపాధ్యాయుడు ఎంతో బక్క చిక్కి చూడటానికి ఎంతో సన్నంగా కనిపిస్తూ ఉన్నారు. కానీ ఒక విద్యార్థి ఒక్కసారిగా ఉపాధ్యాయుడిపై దాడి చేశాడు,ఆ తర్వాత మహిళా ఉపాధ్యాయురాలు చూస్తుండగానే ఉపాధ్యాయుడు పక్కకు చూస్తుండగా వచ్చి ఎముకులపై బలంగా గుద్దాడు, అంతే ఆ నొప్పి తట్టుకోలేని గురుదేవుడు ఏడుస్తూ కొట్టేస్తున్నాడు బాబోయ్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు, తోటి ఉపాధ్యాయులు వచ్చి అదేం పని అంటూ విద్యార్థిని మందలించారు తోటి విద్యార్థులు సైతం ఆ విద్యార్థిని పక్కకి లాక్కుని వెళ్లారు.

వైరల్ అవుతున్న వీడియో..

కానీ ఒక ఉపాధ్యాయుడిని కొట్టడం ఆ వీడియో బయటకి రావడం సోషల్ మీడియాని కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు, ముఖ్యంగా విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయుడిపై చేయి చేసుకుంటారా అదే విధంగా ఉపాధ్యాయుడు కన్నీరు పెట్టుకునే విధంగా అంత బాధను తెప్పిస్తూ గుద్దుతారా అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ సైతం స్పందించి అటువంటి విద్యార్థులకు బుద్ధి చెప్పాలని పలువురు కోరుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *