Last Updated:
Free Bus in AP: ఏపీలోని వారికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రధనుస్సు పథకంలో భాగంగా వారికి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ అధికారికంగా ప్రకటించింది.
Free Bus in AP: ఏపీలోని దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రధనుస్సు పథకంలో భాగంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిపింది. దివ్యాంగుల సంక్షేమ కోసం ప్రత్యేకంగా ఈ ఇంద్రధనుస్సు పథకం ప్రారంభించారు. దీంతో రవాణా భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.
దివ్యాంగుల సాధికారతకు పెద్దపీట వేస్తూ, వారి సామాజిక, ఆర్థిక పురోగతికి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయించింది. ఇంద్రధనుస్సు పథకం కింద అర్హులైన దివ్యాంగులు అందరికీ ఉచిత ప్రయాణ వెసులుబాటు కల్పిస్తారు. అయితే ప్రయాణ సమయంలో దివ్యాంగులు తమ వెంట గుర్తింపు కార్డులు అంటే సదరం సర్టిఫికెట్ లేదా ఆర్టీసీ పాస్ ఇతర సంబంధింత ధ్రువపత్రాలు ఉంచుకోవాలి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏపీఎస్ ఆర్టీసీ త్వరలోనే తెలపనుంది.
రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయం పట్ల దివ్యాంగుల సంఘాలు, లబ్ధితారులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరికి 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న దివ్యాంగులకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పించనున్నారు. వీరికి సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. దివ్యాంగుల సహాయకుడికి టికెట్ ఛార్జీలో 50 శాతం రాయితీ ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని 2024 ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రారంభించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఏపీఎస్ఆర్టీసీ నిర్వహించే సాధారణ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.ఉద్యోగాలు, విద్య, వైద్య అవసరాలు మరియు ఇతర పనుల కోసం రోజూ ప్రయాణించే మహిళలకు ఇది పెద్ద ఊరటగా మారింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో మహిళల సంచారం పెరగడంతో పాటు కుటుంబ ఖర్చులు తగ్గే అవకాశముందని ప్రభుత్వం పేర్కొంది. ఆధార్ లేదా గుర్తింపు కార్డు చూపించడం ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే విధంగా మార్గదర్శకాలు జారీ చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన, భద్రత మరియు సామాజిక భాగస్వామ్యాన్ని పెంచడం ఈ పథక ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



