News Updates Today: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. 1,123 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్.. 385 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ఉంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. అలాగే డాలర్ విలువ పెరిగింది.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను కుదిపేస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. తాజా గణాంకాల ప్రకారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 82.66 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ ఒక్క వారంలోనే బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 12% మేర పెరగడం గమనార్హం. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే త్వరలోనే ఇది 100 డాలర్ల మార్కును చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరికలు పంపారు.


