BR Naidu: ‘ఇకపై దుష్ప్రచార కథనాలు ప్రసారం, ప్రచారం చేస్తే కఠిన చర్యలు’.. బీఆర్ నాయుడు వీడియో కేసులో హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

TTD Chairman BR Naidu: గత రెండు, మూడు రోజులుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై జరుగుతున్న విష ప్రచారానికి తెర పడనుంది. ఈ విష ప్రచారంపై హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు

br naidu
br naidu

TTD Chairman BR Naidu: గత రెండు, మూడు రోజులుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై జరుగుతున్న విష ప్రచారానికి తెర పడనుంది. ఈ విష ప్రచారంపై హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.”తనపై ఆధార రహిత , దుష్ప్రచార కథనాలను ఇకపై ప్రసారం లేదా ప్రచారం చేయకూడదని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రచురితమైన కథనాలను తక్షణమే తొలగించాలని కూడా చెప్పింది. అలాగే గూగుల్, ఎక్స్(ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ డిజిటల్ ప్లాట్ ఫామ్‌లకు సంబంధించిన కంటెంట్‌ పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీయాలనే కుట్రలలో భాగంగా ఏఐ, మార్ఫింగ్ వీడియోల ద్వారా నాపై దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయి. చివరి సత్యమే గెలుస్తుంది. ధర్మం వైపు నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అంటూ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *